తెలంగాణ

telangana

ETV Bharat / business

ఫెడ్​ నిర్ణయం, రూపాయి బలోపేతంతో కొత్త ఉత్సాహం - లాభాలు

ఫెడ్​ రిజర్వ్​ నిర్ణయం, రూపాయి వృద్ధితో మార్కెట్లు ఊపందుకున్నాయి. పెట్టుబడిదారులను పెరుగుతున్న ముడి చమురు ధరలు కలవరపాటుకు గురిచేస్తున్నాయి.

స్టాక్​ మార్కెట్లు

By

Published : Mar 22, 2019, 10:32 AM IST

వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతూ అమెరికా ఫెడ్​ రిజర్వ్​ తీసుకున్న నిర్ణయం అంతర్జాతీయ మార్కెట్లు సహా దేశీయ సూచీలపై సానుకూల ప్రభావంచూపిస్తోంది. రూపాయి బలపడటం స్టాక్​ మార్కెట్లకు కలిసొచ్చింది.

ప్రస్తుతం సెన్సెక్స్​ 111 పాయింట్లు వృద్ధితో 38వేల 498 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 26 పాయింట్ల లాభంతో 11,547 వద్ద ట్రేడవుతోంది.

లాభాల్లో ఉన్నవి ఇవే:

ఇండియా బుల్స్, యెస్​ బ్యాంకు, ఎన్టీపీసీ, బజాజ్​ ఫిన్​ సర్వ్​, ఎల్​ అండ్​ టీ​

పుంజుకున్న రూపాయి:

ట్రేడింగ్​ ప్రారంభంలో రూపాయి 18 పైసలు బలపడింది. డాలర్​తో పోలిస్తే ప్రస్తుతం రూపాయి మారకపు విలువ 68 రూపాయల 64 పైసలుగా ఉంది.

పెరిగిన చమురు ధరలు:

అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. పెరుగుతున్న డిమాండ్​, ఒపెక్​ దేశాలు ఉత్పత్తి తగ్గించటం, ఇరాన్​, వెనెజువెలాపై అమెరికా అంక్షలే ధరల పెరుగుదలకు కారణం. ప్రస్తుతం బ్యారెల్​ ముడి చమురు ధర 67.54 డాలర్లుగా ఉంది.

ABOUT THE AUTHOR

...view details