తెలంగాణ

telangana

ETV Bharat / business

కొవిడ్​-19 భయాలు పక్కనపెట్టి.. స్టాక్​మార్కెట్ల జోరు - rupee

కొవిడ్​-19 వైరస్​ భయాలు వెంటాడుతున్నప్పటికీ స్టాక్​మార్కెట్లు రాణిస్తున్నాయి. చైనాలో వ్యాపార కార్యకలాపాలు తిరిగి ప్రారంభం కావడం మదుపరుల సెంటిమెంట్​ను బలపరిచింది. హెడ్​డీఎఫ్​సీ ట్విన్స్, రిలయన్స్, ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్​యూఎల్ రాణిస్తున్నాయి.

STOCKS OPENs green
దూసుకుపోతున్న స్టాక్​మార్కెట్లు

By

Published : Feb 12, 2020, 9:46 AM IST

Updated : Mar 1, 2020, 1:42 AM IST

కొవిడ్​-19 (కరోనా) భయాలు వెంటాడుతున్నప్పటికీ ... చైనాలో వ్యాపార కార్యకలాపాలు తిరిగి ప్రారంభం అయ్యాయి. దీనితో మదుపరుల సెంటిమెంట్​ బలపడింది. ఫలితంగా ఇవాళ కూడా దేశీయ స్టాక్​మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి.

బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 402 పాయింట్లు లాభపడి 41 వేల 618 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 108 పాయింట్లు వృద్ధిచెంది 12 వేల 216 వద్ద ట్రేడవుతోంది.

జనవరి చివర్లో విడుదలయ్యే ఫ్యాక్టరీల ఉత్పత్తి, సీపీఐ ద్రవ్యోల్బణం, క్యూ 3 ఫలితాలపై మదుపరులు దృష్టి కేంద్రీకరించే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అలాగే ఆర్​బీఐ అంచనా వేసినట్లుగా ద్రవ్యోల్బణం పెరిగే అవకాశముందని భావిస్తున్నారు.

లాభనష్టాల్లో

హెచ్​యూఎల్​, టాటాస్టీల్​, వేదాంత, నెస్లే ఇండియా, పవర్​ గ్రిడ్​కార్ప్, ఎస్​బీఐ, కోల్​ ఇండియా, హెచ్​సీఎల్ టెక్, ఎన్​టీపీసీ, యాక్సిస్ బ్యాంకు రాణిస్తున్నాయి.

ఎస్​ బ్యాంకు, ఇండస్ ​ఇండ్​ బ్యాంకు, భారతీ ఇన్​ఫ్రాటెల్, డా రెడ్డీస్ ల్యాబ్స్​, ఎల్​ అండ్ టీ, టెక్​ మహీంద్రా నష్టాల్లో కొనసాగుతున్నాయి.

ఆసియా మార్కెట్లు

నిక్కీ, హాంగ్​ సెంగ్, కోస్పీ, షాంగై కాంపోజిట్ లాభాల్లో కొనసాగుతున్నాయి. మరోవైపు వాల్​స్ట్రీట్​ కూడా లాభాలతో ముగిసింది.

రూపాయి విలువ

రూపాయి విలువ 5 పైసలు పెరిగి, ఒక డాలరుకు రూ.71.21గా ఉంది.

ముడిచమురు ధర

అంతర్జాతీయ మార్కెట్​లో ముడిచమురు ధర 1.72 శాతం పెరిగింది. ప్రస్తుతం బ్యారెల్ ధర 54.94 డాలర్లుగా ఉంది

ఇదీ చూడండి:ప్రేమికుల రోజు కానుక: రూ.999కే ఇండిగో ఫ్లైట్​ టికెట్

Last Updated : Mar 1, 2020, 1:42 AM IST

ABOUT THE AUTHOR

...view details