తెలంగాణ

telangana

ETV Bharat / business

సర్వత్రా సానుకూలం... మార్కెట్లలో నవోత్సాహం - భారీ లాభాల్లో స్టాక్​మార్కెట్లు

stocks
వడ్డీరేట్లు తగ్గవచ్చనే అంచనాలతో.. భారీ లాభాలు

By

Published : Nov 26, 2019, 9:48 AM IST

Updated : Nov 26, 2019, 10:14 AM IST

09:21 November 26

దేశీయ స్టాక్​మార్కెట్లలో లాభాల జోరు కొనసాగుతోంది. వరుసగా రెండో సెషన్​లో సూచీలు సరికొత్త గరిష్ఠస్థాయిల్ని తాకాయి. ఉదయం బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్​ 200 పాయింట్లకుపైగా పెరిగి చరిత్రలో అత్యధికంగా 41 వేల 120 పాయింట్ల గరిష్ఠస్థాయికి చేరింది. ప్రస్తుతం 175 పాయింట్ల లాభంతో 41 వేల 65 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ ఉదయం రికార్డు స్థాయిలో 12 వేల 132 పాయింట్ల గరిష్ఠస్థాయిని తాకింది. ప్రస్తుతం 40 పాయింట్ల లాభంతో 12 వేల 115 వద్ద కొనసాగుతోంది.

ఇవీ కారణాలు

అమెరికా-చైనా వాణిజ్య ఒప్పందంపై ఆశలు, విదేశీ పెట్టుబడుల రాక స్థిరంగా కొనసాగడం నేటి లాభాలకు ప్రధాన కారణం. ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణ ప్రకటనలు, వచ్చే  పరపతి సమీక్షలో రిజర్వ్​ బ్యాంకు ఆఫ్​ ఇండియా కీలక వడ్డీ రేట్లు తగ్గించవచ్చన్న అంచనాలు కూడా మదుపరుల సెంటిమెంట్​ను బలోపేతం చేశాయి. నవంబర్​ డెరివేటివ్స్ కాంట్రాక్టుల గడువుకు ముందు చిన్న కవరేజ్​ కూడా ర్యాలీకి దోహదపడిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

లాభాల్లో

ఎస్​ బ్యాంకు, సన్​ఫార్మా, టాటా స్టీల్​, ఐసీఐసీఐ బ్యాంకు, హిందాల్కో, ఇన్​ఫోసిస్​, ఎస్​ బ్యాంకు, ఆర్​ఐఎల్​ లాభాల్లో కొనసాగుతున్నాయి.

నష్టాల్లో

భారతీ ఇన్​ఫ్రాటెల్, కోటక్​ బ్యాంకు, ఎల్​ అండ్​ టీ, జీ ఎంటర్​టైన్​మెంట్​, భారతీ ఎయిర్​టెల్, నెస్లే, ఇండస్​ఇండ్ బ్యాంకు, బజాజ్​ ఆటో, హీరో మోటోకార్ప్, కోటక్ మహీంద్ర నష్టాల్లో కొనసాగుతున్నాయి.

ఆసియా మార్కెట్లు

షాంగై, హాంకాంగ్, సియోల్, టోక్యో మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. సోమవారం వాల్​స్ట్రీట్​ లాభాలతో ముగిసింది.

రూపాయి విలువ

రూపాయి విలువ 8 పైసలు వృద్ధి చెంది, ఒక డాలరుకు రూ.71.66గా ఉంది.

ముడిచమురు..

ప్రపంచ మార్కెట్​లో ముడిచమురు ధర 0.05 శాతం తగ్గింది. ప్రస్తుతం బ్యారెల్ ధర 62.59 డాలర్లుగా ఉంది.

ఇదీ చూడండి: మ్యూచువ‌ల్ ఫండ్లలో పెడుతున్నారా? ఇవి గుర్తుంచుకోండి

Last Updated : Nov 26, 2019, 10:14 AM IST

ABOUT THE AUTHOR

...view details