స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాలతో ముగిశాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 46 పాయింట్లు కోల్పోయి 34,916 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 10 పాయింట్ల క్షీణతతో 10,302 వద్దకు చేరింది.
అంతర్జాతీయ సానుకూలతలు, హెవీ వెయిట్ షేర్ల దన్నుతో ఆరంభంలో లాభాలు నమోదు చేసిన సూచీలు.. చివరి గంటలో అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్నాయి.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ 35,234 పాయింట్ల అత్యధిక స్థాయి, 34,813 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 10,401 పాయింట్ల గరిష్ఠ స్థాయి; 10,267 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.