వారాంతంలో దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు నష్టాలతో ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ ఆరంభ ట్రేడింగ్‌లోనే 120 పాయింట్లకుపైగా కోల్పోయింది. ప్రస్తుతం.. 150 పాయింట్ల నష్టంతో 46 వేల 739 వద్ద కొనసాగుతోంది.
భారీ నష్టాల దిశగా స్టాక్‌మార్కెట్లు - trading
భారీ నష్టాల దిశగా స్టాక్‌మార్కెట్లు
09:28 December 18
భారీ నష్టాల దిశగా స్టాక్‌మార్కెట్లు
జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 50 పాయింట్లు నష్టపోయి 13 వేల 680 వద్ద ట్రేడవుతోంది.
లాభనష్టాల్లో..
ఐటీ షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, విప్రో, టీసీఎస్, టెక్ మహంద్రా రాణిస్తున్నాయి.
హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టాటా మోటార్స్, ఓఎన్జీసీ, టాటా మోటార్స్ డీలాపడ్డాయి.