తెలంగాణ

telangana

ETV Bharat / business

భారీగా పెరిగినా చివరకు కొద్దిపాటి లాభాలే! - సెస్సెక్స్​

స్టాక్​ మార్కెట్లు నేడు లాభాల్లో ముగిశాయి. ప్రారంభంలో వచ్చిన భారీ లాభాల కారణంగా సెన్సెక్స్​ జీవనకాల గరిష్ఠ స్థాయిని తాకగా... నిఫ్టీ కీలకమైన 11,700 స్థాయిని తాకింది. మార్కెట్లు ముగిసే సమయానికి మదుపరుల అప్రమత్తతతో  సెన్సెక్స్​ 198.96 పాయింట్లు... నిఫ్టీ 31.70 పాయింట్ల లాభాలతో సరిపెట్టుకున్నాయి.

స్టాక్​ మార్కెట్లు

By

Published : Apr 1, 2019, 4:20 PM IST

Updated : Apr 1, 2019, 4:54 PM IST

2019-20 ఆర్థిక సంవత్సరం మొదటి రోజు స్టాక్ మార్కెట్లు మెరిశాయి. ఆరంభంలో వచ్చిన భారీ లాభాలతో సెన్సెక్స్ జీవన కాల గరిష్ఠాన్ని చేరింది. నిఫ్టీ కూడా 2018 ఆగస్టు తర్వాత తిరిగి 11,700 స్థాయిని తాకింది. అయితే సెషన్​ ముగిసే సమయంలో మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. దీంతో భారీ లాభాల నుంచి మోస్తారు లాభాలతో సరిపెట్టుకున్నాయి సూచీలు.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్​ 198.96 పాయింట్లు బలపడి 38,871.87పాయింట్ల వద్ద స్థిరపడింది.
జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 31.70 పాయింట్ల లాభంతో సెషన్​ ముగిసే సమయానికి 11,655.60 వద్ద స్థిర పడింది.

ఇదీ కారణం

చైనా అమెరికా వాణిజ్య చర్చలు సాఫీగా సాగుతున్నయన్న ఆశలు సహా రేపటి నుంచి ఆర్బీఐ ద్రవ్యవిధాన పాలసీ సమావేశం జరగనున్న నేపథ్యంలో కీలక వడ్డీ రేట్లు తగ్గిస్తుందనే ఆశ మార్కెట్లకు కలిసొచ్చింది. వీటితో పాటు త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలపై అంచనాలు కూడా నేటి ర్యాలీకి కారణం.

ఇంట్రాడే సాగిందిలా..

సూచీ గరిష్ఠం కనిష్ఠం
సెన్సెక్స్​

39,115.57(జీవన కాల గరిష్ఠం)

38,808.74 నిఫ్టీ 11,738.10 11,644.75

లాభానష్టాల్లోనివివే...

సెన్సెక్స్​లో నేడు టాటామోటార్స్​ అత్యధికంగా 7.29 శాతం లాభాలను ఆర్జించింది. ఈ వరుసలో వేదాంతా 2.80 శాతం, భారతీ ఎయిర్​టెల్​ 2.73 శాతం, మారుతీ 2.60 శాతం, టాటా స్టీల్​ 2.54 శాతం, ఎల్​ ఆండ్​ టీ 2.02 శాతం లాభాలను ఆర్జించాయి.

ఇండస్​ఇండ్​ బ్యాంకు 2.41 శాతం నష్టంలో నష్టాల జాబితాలో మొదటి వరుసలో నిలిచింది. యాక్సిస్​ బ్యాంకు 1.65 శాతం, పవర్​ గ్రిడ్​ 1.46 శాతం, ఎం అండ్ ఎం 1.27 హెచ్​డీఎఫ్​సీ 1.21 శాతం, హిందుస్థాన్​ యూనిలీవర్ 1.05 శాతం నష్టాలను నమోదు చేశాయి.

30 షేర్ల సెన్సెక్స్​ ఇండెక్స్​లో 16 షేర్లు లాభాలను నమోదు చేయగా... 14షేర్లు నష్టాల్లో ముగిశాయి.

50 షేర్ల నిఫ్టీ ప్యాక్​లో 28 షేర్లు లాభాలను, 22 షేర్లు నష్టాలను నమోదు చేశాయి.

Last Updated : Apr 1, 2019, 4:54 PM IST

ABOUT THE AUTHOR

...view details