స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ 258 పాయింట్లు పెరిగి 39,303 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ 83 పాయింట్ల లాభంతో 11,604 వద్దకు చేరింది.
కరోనా సంక్షోభం నుంచి ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించడం మదుపరుల్లో సానుకూలతలు పెంచింది. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల ప్రకటన నేపథ్యంలో ఆరంభంలో ఆచితూచి వ్యవహరించిన మదుపరులు చివరి గంటలో భారీగా కొనుగోళ్లు జరపడం లాభాలకు కలిసొచ్చినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఈ సారి వడ్డీ రేట్ల కన్నా ఆర్థిక వృద్ధికి ఫెడ్ తీసుకునే నిర్ణయాలపైనే ఎక్కువగా అంచనాలు ఉన్నట్లు అభిప్రాయపడుతున్నారు.
ఇంట్రాడే సాగిందిలా
సెన్సెక్స్ 39,359 పాయింట్ల అత్యధిక స్థాయి, 39,038 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 11,618 పాయింట్ల గరిష్ఠ స్థాయి;11,516 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాల్లోనివి ఇవే..
ఎం&ఎం, బజాజ్ ఆటో, సన్‌ఫార్మా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇన్ఫోసిస్ షేర్లు ప్రధానంగా లాభాల్లో ఉన్నాయి.