తెలంగాణ

telangana

ETV Bharat / business

ఊహాగానాలతో మార్కెట్ల జోరు - లాభాలు

వరుసగా ఏడో సెషన్​ను లాభాలతో ముగించాయి స్టాక్​ మార్కెట్లు. నిఫ్టీ 11,500 మార్క్​ని దాటింది. వచ్చే 12 నెలల పాటు మార్కెట్లు ఇదే జోరు కొనసాగిస్తాయని బ్రోకరేజ్​ సంస్థ గోల్డ్​ ​మ్యాన్​ శాక్స్​ తెలిపింది.

స్టాక్​ మార్కెట్లు

By

Published : Mar 19, 2019, 5:30 PM IST

Updated : Mar 19, 2019, 9:01 PM IST

వరుసగా ఏడో సెషన్​లోనూ స్టాక్​ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్​ 268 పాయింట్ల లాభంతో 38వేల 218 వద్ద ముగియగా, నిఫ్టీ 70 పాయింట్ల వృద్ధితో 11,543 వద్ద ముగిసింది.

ట్రేడింగ్​ సాగిందిలా:

స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ సూచీలు... అమెరికా ఫెడ్​ రిజర్వ్​ కమిటీ సమావేశ ప్రభావంతో కొంత మేర మందగించాయి. తరువాత కోలుకుని లాభాలతో ముగిశాయి.

లాభాలకు కారణాలివే:

⦁ సార్వత్రిక ఎన్నికల అనంతరం స్థిరమైన ప్రభుత్వం ఏర్పడుతుందనే ఊహాగానాలు.

⦁ స్థిరాస్తి రంగానికి చేయూతగా నిర్మాణంలో ఉన్న ఇళ్లపై జీఎస్టీ రేట్లు తగ్గించడానికి జీఎస్టీ మండలి ఆమోద ముద్ర వేసింది.

⦁ ఆసియా మార్కెట్ల లాభాలు సైతం దేశీయ సూచీలపై ప్రభావం చూపాయి.

⦁ ఆరు నెలల గరిష్టానికి వడ్డీ రేట్లు పెంచుతూ ఫెడరల్​ రిజర్వ్​ కమిటీ ఈ వారం నిర్ణయం తీసుకుంటుందనే అంచనాలు.

ఈ కారణాలతో పెట్టుబడి దారులు కొనుగోళ్లు జరిపారు.

సంవత్సరం పాటు ఇదే జోరు:

మరో సంవత్సరం పాటు మార్కెట్లు లాభాల జోరునే కొనసాగిస్తాయని ప్రఖ్యాత బ్రోకరేజ్​ సంస్థ గోల్డ్​ ​మ్యాన్​ శాక్స్​ అంచనా వేసింది. సార్వత్రిక ఎన్నికలు, ఆ తర్వాత స్థిరమైన ప్రభుత్వం ఏర్పడుతుందనే ఊహాగానాలే దీనికి కారణమని పేర్కొంది. విదేశీ నిధుల ప్రవాహం అధికంగా ఉండే అవకాశముందని తెలిపింది. 1996 నుంచి ఎన్నికలు జరుగుతున్న ప్రతిసారి మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్న విషయాన్ని గుర్తు చేసింది గోల్డ్​ మ్యాన్​ శాక్స్​.

Last Updated : Mar 19, 2019, 9:01 PM IST

ABOUT THE AUTHOR

...view details