తెలంగాణ

telangana

ETV Bharat / business

సానుకూలతలతో కొనసాగుతున్న బుల్​ రన్​ - సెన్సెక్స్

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వస్తున్న సానుకూలతలతో దేశీయ స్టాక్​ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్​ 201 పాయింట్లు పుంజుకుంది. నిఫ్టీ 49 పాయింట్ల లాభంతో ట్రేడింగ్​ కొనసాగిస్తోంది.

బుల్​ రన్

By

Published : Mar 27, 2019, 9:50 AM IST

అంతర్జాతీయ సానుకూలతలతో స్టాక్​ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెనెక్స్​ 206.53 పాయింట్లు పెరిగింది. ప్రస్తుతం 38,439.94 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 48.90 పాయింట్లు పుంజుకుని 11,500 పాయింట్ల స్థాయిని తాకింది. ప్రస్తుతం 11,532.15 వద్ద కొనసాగుతోంది.

సెన్సెక్స్​లో బ్యాంకింగ్​ రంగ షేర్లు ఆకట్టుకుంటున్నాయి. ఇండస్ ఇండ్​ బ్యాంకు, వేదాంత, యస్​ బ్యాంకు, ఎస్​బీఐ, ఎల్​అండ్​టీ, యాక్సిస్​ బ్యాంకు, కోటక్​ బ్యాంకు, హెచ్​డీఎఫ్​సీ బ్యాంకు షేర్లు లాభాల జాబితాలో ప్రధానంగా కనిపిస్తున్నాయి.

హీరో మోటోకార్ప్​, ఓఎన్​జీసీ, కోల్​ ఇండియా, ఎస్​టీపీసీ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

30 షేర్ల ఇండెక్స్​లో 24 షేర్లు లాభాల్లో ట్రేడవుతుండగా...6 షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

ABOUT THE AUTHOR

...view details