తెలంగాణ

telangana

ETV Bharat / business

భారీ లాభాల నుంచి నష్టాల్లోకి మార్కెట్లు - సెస్సెక్స్

stocks live
స్టాక్ మార్కెట్స్ లైవ్

By

Published : Sep 14, 2020, 9:22 AM IST

Updated : Sep 14, 2020, 2:42 PM IST

14:31 September 14

నష్టాల్లోనూ ఐటీ జోరు..

స్టాక్ మార్కెట్లు భారీ లాభాల నుంచి ఒక్క సారిగా నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ 160 పాయింట్లకుపైగా నష్టంతో 38,688 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ దాదాపు 50 పాయింట్లు తగ్గి 11,415  వద్ద కొనసాగుతోంది.

ఆరంభ లాభాలను మదుపరులు సొమ్ము చేసుకునే పనిలో పడ్డారు. ఆర్థిక షేర్లు భారీగా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఐటీ షేర్లు మాత్రం లాభాల జోరును కొనసాగిస్తున్నాయి.

  • హెచ్​సీఎల్​టెక్(9.50 శాతం), టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, టీసీఎస్, బజాజ్ ఆటో షేర్లు లాభాల్లో ఉన్నాయి.
  • భారతీ ఎయిర్​టెల్, బజాజ్ ఫినాన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, సన్​ఫార్మా, హెచ్​యూఎల్​, హెచ్​డీఎఫ్​సీ షేర్లు నష్టాల్లో ప్రధానంగా ఉన్నాయి.

10:39 September 14

లాభాల్లో స్థిరంగా..

స్టాక్ మార్కెట్లు లాభాల్లో స్థిరంగా కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 320 పాయింట్లకుపైగా పుంజుకుని..39,171 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ దాదాపు 80 పాయింట్ల లాభంతో 11,543 కొనసాగుతోంది. 

టెక్  షేర్లు ప్రధానంగా లాభాలకు ఊతమందిస్తున్నాయి.

హెచ్​సీఎల్​టెక్​ 7 శాతానికిపైగా లాభపడింది. ఇన్ఫోసిస్, టీసీఎస్​, టెక్ మహీంద్రా, ఎం&ఎం, ఓఎన్​జీసీ షేర్లు లాభాల్లో ప్రధానంగా ఉన్నాయి.

భారతీ ఎయిర్​టెల్, బజాజ్ ఫినాన్స్, ఏషియన్​ పెయింట్స్, హెచ్​యూఎల్, సన్​ఫార్మా షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

08:53 September 14

11,500పైకి నిఫ్టీ..

స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్ 310 పాయింట్లకుపైగా లాభంతో 39,166 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 70 పాయింట్లకుపైగా వృద్ధితో 11,540 వద్ద కొనసాగుతోంది. 

ఐటీ, బ్యాంకింగ్ షేర్లు లాభాలకు దన్నుగా నిలుస్తున్నాయి. 

Last Updated : Sep 14, 2020, 2:42 PM IST

ABOUT THE AUTHOR

...view details