తెలంగాణ

telangana

ETV Bharat / business

ఐటీ షేర్ల పరుగులు.. లాభాలతో ముగిసిన మార్కెట్లు - షేర్ మార్కెట్లు

sensex today
నేటి స్టాక్ మార్కెట్లు

By

Published : Jul 13, 2020, 9:28 AM IST

Updated : Jul 13, 2020, 3:46 PM IST

15:42 July 13

లాభాలతో ముగింపు...

ఐటీ షేర్లు పరుగులు పెట్టడం వల్ల స్టాక్​ మార్కెట్లు సోమవారం లాభాలతో ముగిశాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 99 పాయింట్లు లాభపడి 36,693 వద్ద స్థిరపడ్డాయి. నిఫ్టీ 34 పాయింట్లు వృద్ధి చెంది 10,802కు చేరింది.

14:01 July 13

ఫ్లాట్​గా సూచీలు..

స్టాక్ మార్కెట్లు సెషన్​ చివరి గంటలో ఒడుదొడుకులు ఎదుర్కొంటున్నాయి. ఆరంభంలో నమోదైన భారీ లాభాలను మదుపరులు సొమ్ము చేసుకునే పనిలో పడ్డారు. ఫలితంగా సెన్సెక్స్ 8 పాయింట్లు కోల్పోయి 36,585 వద్ద ఫ్లాట్​గా ట్రేడవుతోంది. నిఫ్టీ 10,773 వద్ద ఫ్లాట్​గా కొనసాగుతోంది.

  • ఆర్థిక షేర్లలో అధికంగా అమ్మకాల ఒత్తిడి కనిపిస్తోంది.
  • టెక్ మహీంద్రా, హెచ్​సీఎల్​టెక్, రిలయన్స్, హెచ్​యూఎల్, ఐటీసీ, ఇన్ఫోసిస్ లాభాల్లో ఉన్నాయి.
  • హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, బజాజ్ ఫినాన్స్, ఐసీఐఐసీఐ బ్యాంక్, పవర్​ గ్రిడ్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

12:09 July 13

మిడ్​ సెషన్​లో కాస్త వెనక్కి..

మిడ్​ సెషన్​లో భారీ లాభాల నుంచి కాస్త వెనక్కితగ్గాయి స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 160 పాయింట్లకు పైగా వృద్ధితో 36,758 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 50 పాయింట్లకుపైగా లాభంతో 10,823 వద్ద ట్రేడవుతోంది.

  • బ్యాంకింగ్, ఆటో షేర్లలో అమ్మకాలు పెరగటం వల్ల సూచీల జోరు తగ్గినట్లు తెలుస్తోంది. ఐటీ, ఎఫ్​ఎంసీజీ, ఫార్మా షేర్లు మాత్రం సానుకూలంగానే స్పందిస్తున్నాయి.
  • టెక్ మహీంద్రా, హెచ్​సీఎల్​టెక్, ఇన్ఫోసిస్, హెచ్​యూఎల్, ఐటీసీ, సన్​ఫార్మా షేర్లు లాభాల్లో ఉన్నాయి.
  • జియోలో మరో సంస్థ పెట్టుబడి పెట్టిన నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు దాదాపు 3 శాతం పుంజుకున్నాయి.
  • హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, బజాజ్ ఫినాన్స్​, పవర్​గ్రిడ్, ఎస్​బీఐ, కోటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్​డీఎఫ్​సీ ప్రధానంగా నష్టాల్లో ఉన్నాయి.

10:55 July 13

10,900లకు చేరువైన నిఫ్టీ..

స్టాక్ మార్కెట్లలో లాభాల జోరు కొనసాగుతోంది. సెన్సెక్స్ 360 పాయింట్లకుపైగా పెరిగి 36,859 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 100 పాయింట్లకుపైగా లాభంతో 10,874 వద్ద కొనసాగుతోంది.

ఐటీ, లోహ, విద్యుత్, ఎఫ్​ఎంసీజీ షేర్లు లాభాలకు దన్నుగా నిలుస్తున్నాయి.

టెక్ మహీంద్రా, రిలయన్స్​, హెచ్​సీఎల్​టెక్, ఇన్ఫోసిస్, హెచ్​యూఎల్​, ఎన్​టీపీసీ, టాటా స్టీల్ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.

హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, హెచ్​డీఎఫ్​సీ షేర్లు మాత్రమే 30 షేర్ల ఇండెక్స్​లో నష్టాల్లో ఉన్నాయి.

09:00 July 13

భారీ లాభాల్లో మార్కెట్లు..

చివరి సెషన్ నష్టాల నుంచి తేరుకుని సోమవారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి స్టాక్ మార్కెట్లు. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 320 పాయింట్లకుపైగా బలపడి 36,917 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 80 పాయింట్లకుపైగా లాభంతో 10,851 వద్ద ట్రేడవుతోంది.

ఆర్థిక, లోహ రంగాలు సహా హెవీ వెయిట్ షేర్లు లాభాలకు దన్నుగా నిలుస్తున్నాయి. 

టాటా స్టీల్, ఇండస్ఇండ్ బ్యాంక్, రిలయన్స్, బజాజ్ ఫినాన్స్, ఇన్ఫోసిస్, ఎస్​బీఐ షేర్లు లాభాల్లో ఉన్నాయి.

బజాజ్ ఆటో, భారతీ ఎయిర్​టెల్​, టీసీఎస్​లు మాత్రమే 30 షేర్ల ఇండెక్స్​లో ఒడుదొడుకులు ఎదుర్కొంటున్నాయి.

Last Updated : Jul 13, 2020, 3:46 PM IST

ABOUT THE AUTHOR

...view details