తెలంగాణ

telangana

ETV Bharat / business

2 నెలల్లో సెన్సెక్స్​ 7,850 పాయింట్లు కోల్పోయిందిలా...

కరోనా భయాలతో గత నెలాఖరు నుంచి భారీ నష్టాలను నమోదు చేసిన స్టాక్ మార్కెట్లు నేడు ఎట్టకేలకు లాభాలతో ముగిశాయి. ఫిబ్రవరి 28 నుంచి మార్కెట్లు ఎదుర్కొన్న ఒడుదొడుకుల వివరాలు ఇలా ఉన్నాయి.

stock market news
స్టాక్ మార్కెట్లు

By

Published : Mar 13, 2020, 5:00 PM IST

స్టాక్ మార్కెట్లు వరుస నష్టాల నుంచి కాస్త తేరుకున్నాయి. కరోనా భయాలు ప్రపంచ దేశాలను వణికిస్తున్న నేపథ్యంలో ఇటీవల చారిత్రక నష్టాలను చవి చూసిన మార్కెట్లు.. నేడు మళ్లీ భారీ లాభాలను నమోదు చేశాయి.

కరోనా సహా ఆర్థిక మందగమనం భయాలతో గత నెల నుంచే మార్కెట్లు ఒడుదొడుకుల్లో కొనసాగుతున్నప్పటికీ.. నెలాఖరు(ఫిబ్రవరి 28) నుంచి రికార్డు స్థాయి నష్టాల్లోకి జారుకున్నాయి.

  • ఈ ఏడాది జనవరి 14న సెన్సెక్స్​ జీవనకాల గరిష్ఠం 41,953 వద్ద, నిఫ్టీ జనవరి 16న జీవనకాల గరిష్ఠం 12,355 పాయింట్ల వద్ద ఉన్నాయి. సెన్సెక్స్​ ప్రస్తుతం (మార్చి 13) 34,103వద్ద, నిఫ్టీ 9,955వద్ద స్థిరపడ్డాయి.

ఫిబ్రవరి నెలాఖరు నుంచి ట్రేడింగ్ ఇలా..

తేదీ సెన్సెక్స్ నిఫ్టీ
ఫిబ్రవరి 28 -1,448 -431
మార్చి 2 -153 -69
మార్చి 3 +480 +171
మార్చి 4 -214 -52
మార్చి 5 +61 +18
మార్చి 6 -894 -280
మార్చి 9 -1,942 -538
మార్చి 11 +62 +07
మార్చి 12 -2,919 -868
మార్చి 13(నేడు) +1,325 +365

ఇదీ చూడండి:'కరోనా భయాలు ఉన్నా.. ద్రవ్యోల్బణం కాపాడింది'

ABOUT THE AUTHOR

...view details