తెలంగాణ

telangana

ETV Bharat / business

ఐదో రోజూ అదే జోరు- మార్కెట్లు కళకళ - లాభాలు

వరుసగా 5వ సెషన్​లో స్టాక్​మార్కెట్లు లాభాల బాటలో కొనసాగుతున్నాయి. ఆసియా మార్కెట్ల సానుకూలతతో బ్యాంకింగ్, ఆటో షేర్ల కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. ఆర్బీఐ వడ్డీరేట్ల తగ్గింపు అంచనాలతో స్టాక్​ మార్కెట్లు స్థిరంగా ఉండే అవకాశముంది.

ఐదో రోజూ అదే జోరూ- స్టాక్​ మార్కెట్ల కళకళ

By

Published : Apr 3, 2019, 10:24 AM IST

నూతన ఆర్థిక సంవత్సరం మూడో రోజూ స్టాక్​మార్కెట్లలో లాభాల జోరు కొనసాగుతోంది. ఆసియా మార్కెట్లలో సానుకూలతలతో బ్యాంకింగ్​, ఆటో రంగం షేర్ల కొనుగోలుకు మదుపర్లు మొగ్గుచూపడమే ఇందుకు కారణం.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ- సెన్సెక్స్​ 156పాయింట్లు వృద్ధిచెందింది. ప్రస్తుతం ​ 39వేల 212వద్ద ట్రేడ్​ అవుతోంది. నిఫ్టీ 27పాయింట్ల లాభంతో 11వేల 740వద్ద కొనసాగుతోంది.

రిజర్వు బ్యాంకు వడ్డీరేట్లు తగ్గిస్తుందన్న అంచనాల మధ్య విదేశీ పెట్టుబడుల రాకతో స్టాక్​ మార్కెట్లు స్థిరంగా ఉండే అవకాశం ఉంది.

లాభాల్లోనివి...

టాటా మోటర్స్​, ఇండస్​ఇండ్​ బ్యాంక్, కొటాక్​ బ్యాంక్​, టాటా స్టీల్​, భారతీ ఎయిర్​టెల్​, యెస్​ బ్యాంక్​

నష్టాల్లోనివి...

ఇన్​ఫోసిస్​, హెచ్​యూఎల్​, కోల్​ ఇండియా, సన్​ ఫార్మా షేర్లు నష్టాల బాటపట్టాయి.​

పుంజుకున్న రూపాయి...

రూపాయి 9 పైసలు మెరుగుపడి డాలరుతో మారకం విలువ 68.65 వద్ద ఉంది.

చమురు ధరలు స్వల్పంగా పెరిగాయి. బ్యారెల్ ధర 69.73డాలర్లకు చేరింది.

ABOUT THE AUTHOR

...view details