తెలంగాణ

telangana

ETV Bharat / business

ఫిచ్​ కొత్త లెక్కలతో గాడి తప్పిన స్టాక్​మార్కెట్లు - నష్టాలు

స్టాక్​ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. జీడీపీ వృద్ధి రేటు అంచనాలు తగ్గిస్తూ ఫిచ్​ చేసిన ప్రకటనతో భారీగా అమ్మకాలు జరిపారు పెట్టుబడిదారులు.

స్టాక్​ మార్కెట్లు

By

Published : Mar 22, 2019, 5:17 PM IST

ఎనిమిది రోజుల స్టాక్​ మర్కెట్ల లాభాల జోరుకు శుక్రవారం బ్రేక్​ పడింది. స్టాక్​ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి.

సెన్సెక్స్​ 222 పాయింట్ల నష్టంతో 38వేల 164 వద్ద ముగిసింది. నిఫ్టీ 64 పాయింట్లు క్షీణతతో 11,456 వద్ద ముగిసింది.

భారత జీడీపీ వృద్ధి రేటు అంచనాలు తగ్గిస్తూ ఫిచ్ చేసిన ప్రకటనతో భారీగా అమ్మకాలు జరిపారు మదుపరులు.

ట్రేడింగ్​ నష్టాలు మూటగట్టుకున్న సంస్థల జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది టాటా మోటార్స్​. తర్వాతి స్ధానంలో రిలయన్స్​, మారుతి, ఎస్​బీఐ, బజాజ్​ ఫైనాన్స్​ నిలిచాయి.

లాభాలు సాధించిన వాటిలో ఎన్టీపీసీ మొదటి స్థానంలో నిలిచింది.

ABOUT THE AUTHOR

...view details