తెలంగాణ

telangana

ETV Bharat / business

Stock Market live: మార్కెట్​లో కొనుగోళ్ల జోరు- సెన్సెక్స్​ 500 ప్లస్​ - నిఫ్టీ

stock-market-live-updates
లాభాల్లో సూచీలు, Stock Market live

By

Published : Dec 1, 2021, 9:31 AM IST

Updated : Dec 1, 2021, 2:41 PM IST

14:38 December 01

మార్కెట్లలో జోరు..

దేశీయ స్టాక్​ మార్కెట్​ సూచీలు లాభాల్లో దూసుకెళ్తున్నాయి. సెన్సెక్స్​ 600 పాయింట్లు పెరిగి.. 57 వేల 650 వద్ద ఉంది.

నిఫ్టీ 170 పాయింట్లు పెరిగి.. 17 వేల 150 ఎగువన ఉంది.

13:31 December 01

స్టాక్​ మార్కెట్​ సూచీలు స్థిరంగా లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్​ 300 పాయింట్లు పెరిగి.. ప్రస్తుతం 57 వేల 370 వద్ద ట్రేడవుతోంది.

నిఫ్టీ 100 పాయింట్ల లాభంతో 17 వేల 86 వద్ద ఉంది.

లాభనష్టాల్లో..

ఇండస్​ ఇండ్​ బ్యాంక్​, యాక్సిస్​ బ్యాంక్​, జేఎస్​డబ్ల్యూ స్టీల్​, ఐచర్​ మోటార్స్​, టెక్​ మహీంద్రా రాణిస్తున్నాయి.

సిప్లా, ఐఓసీ, దివీస్​ ల్యాబ్స్​, డా. రెడ్డీస్​ ల్యాబ్స్​, ఓఎన్​జీసీ డీలాపడ్డాయి.

09:16 December 01

Stock Market today: లాభాల్లో సూచీలు- 17 వేల ఎగువకు నిఫ్టీ

Stock Market live: స్టాక్​ మార్కెట్లు బుధవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్​ 600 పాయింట్లు పెరిగింది. ప్రస్తుతం 57 వేల 700 ఎగువన కొనసాగుతోంది.

జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ మళ్లీ 17 వేల మార్కును అధిగమించింది. ప్రస్తుతం దాదాపు 200 పాయింట్ల లాభంతో 17 వేల 170 ఎగువన ట్రేడవుతోంది.

Stock market news:

ఇండస్​ ఇండ్​ బ్యాంక్​, టెక్​ మహీంద్రా, ఐచర్​ మోటార్స్​, హెచ్​డీఎఫ్​సీ, అదానీ పోర్ట్స్​ లాభాల్లో ఉన్నాయి.

పవర్​ గ్రిడ్​ కార్పొరేషన్​, డాక్టర్​ రెడ్డీస్​ స్వల్ప నష్టాల్లో ఉన్నాయి.

ఇదీ చూడండి: క్యూ2​లో జీడీపీ వృద్ధి రేటు 8.4 శాతం

Last Updated : Dec 1, 2021, 2:41 PM IST

ABOUT THE AUTHOR

...view details