తెలంగాణ

telangana

ETV Bharat / business

విదేశీ నిధుల రాకతో బుల్​ పరుగులు

అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల ట్రేడింగ్​, విదేశీ నిధుల ప్రవాహంతో స్టాక్​ మార్కెట్లు లాభాల జోరు కొనసాగిస్తున్నాయి. దీనికి రూపాయి తన వంతు సహకారాన్ని అందించింది.

మార్కెట్లు

By

Published : Mar 18, 2019, 11:04 AM IST

సోమవారం దేశీయ సూచీలు లాభాల బాట పట్టాయి. ఆసియా మార్కెట్ల సానుకూల ట్రేడింగ్​, విదేశీ నిధుల ప్రవాహమే ఇందుకు కారణం.

సెన్సెక్స్​ 276 పాయింట్ల వృద్ధితో 38,298 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 76 పాయింట్ల లాభంతో 11,508 వద్ద ట్రేడవుతోంది.

గత వారం వరుసగా ఐదు రోజులు లాభాల బాటలో పయనించిన మార్కెట్లు 1,352 పాయింట్లు గడించాయి.

ఆరోగ్యం, చమురు, బ్యాంకింగ్​, ఐటీ రంగాల షేర్లు లాభాల్లో ఉన్నాయి.

లాభ-నష్టాలు

పవర్​గ్రిడ్​, కోటక్​ బ్యాంక్​, హెచ్​డీఎఫ్​సీ బ్యాంకు, రిలయన్స్​, యాక్సిస్​ బ్యాంకు,

ఆటో మొబైల్​ సంస్థ మారుతీ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

సూచీల జోరుకు కారణాలివే:

⦁ విదేశీ నిధుల ప్రవాహంతో దేశంలో వాణిజ్య లోటు కొంత మేర తగ్గింది. ఇది పెట్టుబడి దారుల్లో భరోసా పెంచింది.

⦁ ఆసియా మార్కెట్లు సహా వాల్​ స్ట్రీట్​ లాభాల్లో ఉండగా... అంతర్జాతీయ మార్కెట్లు లాభాల బాటలో పరుగులు తీస్తున్నాయి.

నమ్మకం పెంచిన రూపాయి:

గత వారం వేగంగా పుంజుకున్న రూపాయి, నేడూ అదే జోరు కొనసాగించింది. ప్రస్తుతం 17 పైసలు బలపడిన రూపాయి మారక విలువ 68 రూపాయిల 93 పైసల వద్ద కొనసాగుతోంది.

ABOUT THE AUTHOR

...view details