అవినీతి కేసులో శాంసంగ్ వైస్ ఛైర్మన్ లీ జే యాంగ్‌కు రెండున్నరేళ్ల జైలు శిక్షను ఖరారు చేస్తూ దక్షిణ కొరియాలోని సియోల్ హైకోర్టు తీర్పు చెప్పింది. అవినీతి కేసులో 2017లోనే లీ జే యాంగ్‌కు ఐదేళ్ల జైలు శిక్ష విధించగా.. శిక్షను 2018లో రెండున్నరేళ్లకు కుదించింది సియోల్ హైకోర్టు. అయితే 2019లో మరోసారి విచారణ జరిపింది. తాజాగా లీ జే యాంగ్‌కు రెండున్నరేళ్ల జైలుశిక్ష ఖరారు చేసింది సియోల్ హైకోర్టు.
శాంసంగ్ వైస్ ఛైర్మన్‌కు రెండున్నరేళ్ల జైలు - సియోల్ హైకోర్టు
అవినీతి కేసులో శాంసంగ్ వైస్ ఛైర్మన్ లీ జే యాంగ్‌కు రెండున్నరేళ్ల జైలు శిక్షను ఖరారు చేసింది సియోల్ హైకోర్టు. 2017లోనే ఐదేళ్ల జైలు శిక్ష విధించగా .. 2019 లో ఈ కేసుపై మరోసారి విచారణ జరిపింది. తాజాగా తుది తీర్పును వెలువరించింది సియోల్ న్యాయస్థానం.
2016లో జరిగిన అవినీతి కేసులో లీ జే సహా దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు జియున్- హేకు కూడా ఉండటం వల్ల దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడికి లంచం ఇవ్వజూపిన కేసులో లీ జే యాంగ్‌కు 9 ఏళ్లు జైలు శిక్ష విధించాలని పిటిషనర్ తరఫు న్యాయవాది సుప్రీం కోర్టును కోరారు. అయితే 2017లో ఐదేళ్లు శిక్ష విధిస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే 2019లో ఈ కేసును సుప్రీంకోర్టు.. సియోల్ కోర్టుకు బదిలీ చేసింది. విచారణ అనంతరం రెండున్నరేళ్లకు శిక్షను తగ్గిస్తూ తీర్పు చెప్పింది సియోల్ కోర్టు. తాజాగా న్యాయస్థానం శిక్షను ఖరారు చేసింది.
ఇదీ చదవండి :అవినీతి కేసులో శాంసంగ్ వైస్ ఛైర్మన్‌కు 9ఏళ్ల జైలు!