ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్(Ola Electric Scooter) కొనుగోలు చేసేందుకు వినియోగదారులు అమితాసక్తిని కనబరిచారు. అమ్మకాలు ప్రారంభించినమొదటిరోజే తమకు ఊహించని రీతిలో స్పందన లభించినట్లు ఓలా సంస్థ తెలిపింది. రూ.600 కోట్లకు పైగా విలువ చేసే.. ఎస్1 మోడల్ స్కూటర్ల(Ola Electric Scooter) అమ్మకాలు జరిగినట్లు ఓలా సహ వ్యవస్థాపకుడు భవీష్ అగర్వాల్.. ట్విట్టర్ వేదికగా తెలిపారు. గురువారం అర్ధరాత్రి నుంచి అమ్మాకాల ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు.
"భారతీయులు పెట్రోల్ వాహనాలను కాదని విద్యుత్ వాహనాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మేము సెకనుకు 4 స్కూటర్ల చొప్పున అమ్మాం. వీటి విలువ రూ.600 కోట్లకుపైనే. ఈరోజే ఓలా స్కూటర్ కొనుగోలుకు చివరిరోజు. గురువారం అర్ధరాత్రి నుంచి కొనుగోళ్లను నిలిపివేస్తున్నాం."