సామాజిక మాధ్యమాల్లో దేశీయ మొబైల్ యాప్‌లకు డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. సరిహద్దుల్లో చైనా-భారత్ మధ్య వివాదం తర్వాత 'బాయ్‌కాట్ చైనా' ఉద్యమం ఊపందుకోవడం దేశీయ సామాజిక మాధ్యమ, చాటింగ్ యాప్‌లకు కలిసొస్తోంది.
టిక్‌టాక్‌కు పోటీ..
చైనాకు చెందిన టిక్‌టాక్ యాప్‌కు దేశీయంగా ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ యాప్‌కు పోటీగా రూపొందించిన 'చింగారీ' ఇప్పుడు మంచి ఆదరణ పొందుతోంది.
తమ యాప్ 25 లక్షల డౌన్లోడ్ల మైలురాయిని దాటినట్లు చింగారీ యాప్ నిర్వాహకులు ప్రకటించారు. గడిచిన 10 రోజుల్లో 5 లక్షల 50 వేల మంది ఈ యాప్ డౌన్లోడ్ చేసుకున్నట్లు వెల్లడించారు. అంతకు ముందు ఓ సారి చేసిన ప్రకటనలో కేవలం మూడు రోజుల్లో 5 లక్షల మంది తమ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారని పేర్కొనడం గమనార్హం.