తెలంగాణ

telangana

ETV Bharat / business

భారత్​లో స్మార్ట్​ఫోన్​ బాసుల ట్విట్టర్​ వార్​ - రెడ్ మీ

స్మార్ట్​ ఫోన్ కంపెనీల మధ్య పోటీ మాములే. అయితే అది ఫోన్ మోడల్స్​ పైనే ఉండేది. ఇది గతంలో మాట. ఇప్పుడు భారత్​లో మొబైల్ కంపెనీల అధినేతలు ప్రత్యర్థి బ్రాండ్​పై పరస్పర విమర్శలు చేసుకుంటూ హాట్ టాపిగ్​గా మారుతున్నారు.

భారత్​లో స్మార్ట్ ఫోన్ బాసుల ట్విట్టర్​ వార్​

By

Published : May 20, 2019, 5:37 AM IST

స్మార్ట్ ఫోన్ కంపెనీలు ఇప్పటి వరకు కొత్త మోడళ్లు తీసుకురావటంలో పోటీ పడటం చూశాం. కానీ ఇటీవల కాలంలో కొన్ని కంపెనీల ఉన్నతాధికారులు ట్విట్టర్​ వేదికగా ప్రత్యర్థి కంపెనీల మొబైల్స్​పై విమర్శలకు దిగుతున్నారు. నెటిజన్లు వారిపై మీమ్​లు, జోకులు వేసుకునేందుకు వారే కారణమవుతున్నారు.

షామీ ఎండీ ఆజ్యం..

సామాజిక మాధ్యమాల వేదికగా ప్రత్యర్థి మొబైల్ కంపెనీల మోడల్స్​పై విమర్శలకు తెరలేపారు షామీ మేనేజింగ్​ డైరెక్టర్ మను కుమార్ జైన్. రియల్ మీ మొబైల్​పై ఆయన చేసిన ట్వీట్ సోషల్​ మీడియా వార్​కు దారితీసింది.

"రియల్ మీ 3 ప్రోలో వాడిన క్వాల్​కామ్ స్నాప్ డ్రాగన్ 710.. రెడ్​ మీ నోట్ 7 ప్రోలో వాడిన స్నాప్ డ్రాగన్ 625 కన్నా చాలా పాతది."
-ట్విట్టర్​లో షామీ ఎండీ జైన్

షామీ ఉత్పత్తుల దిగుమతులు గతేడాదితో పోలిస్తే 2 శాతం తగ్గాయి. గతేడాది ఇదే త్రైమాసికంలో 31 శాతం మార్కెట్​ వాటా నమోదు చేసింది షామీ. అయితే తొలి త్రైమాసికంలో భారత్​లో అగ్రగామిగా షామీ తన స్థానాన్ని నిలుపుకుంది.

దీటుగా సమాధానం

జైన్ వ్యాఖ్యలపై దీటుగా స్పందించారు రియల్​ మీ ఇండియా సీఈఓ మాధవ్​ సేఠ్.

"రియల్ మీ విజయాన్ని చూసి 'షామీ ఆత్మరక్షణ'లో పడింది. కొందరు భయపడుతున్నారు."
-రియల్ మీ ఇండియా సీఈఓ మాధవ్ సేఠ్​ ట్వీట్

2019 మొదటి త్రైమాసికంలో భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్​లో రియల్​ మీ 7 శాతం మార్కెట్ వాటాను దక్కించుకోవడాన్ని బట్టి చూస్తే.. షామీ అలా స్పందించడంలో తప్పులేదని విమర్శించారు.

2018లో భారత్​లోకి ప్రవేశించిన రియల్ మీ అతితక్కువ కాలంలో 60 లక్షల స్మార్ట్ ఫోన్లు విక్రయించిన సంస్థగా రికార్డు సాధించింది.

రెడ్ మీపై విమర్శలు చేసిన మాధవ్ సేఠ్ మరో మొబైల్ దిగ్గజం వివోను మాత్రం వెనకేసుకొచ్చారు. 2019 మొదటి త్రైమాసికంలో గతంలో ఎన్నడూ లేనంతగా వివో మార్కెట్ వాటాను దక్కించుకుందన్నారు.

నెమ్మదిగా ఈ ట్వీట్లు చర్చకు దారితీస్తున్న సమయంలో ఒరిజినల్ ట్వీట్లను డిలీట్​ చేశారు ఈ స్మార్ట్ ఫోన్ సంస్థల బాసులు.

ఇదీ చూడండి: పసిబిడ్డ హత్యకు తల్లి యత్నం- కాపాడిన శునకం

ABOUT THE AUTHOR

...view details