స్టాక్ మార్కెట్లు వారాంతంలో భారీ లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ 354 పాయింట్లు పెరిగి 39,467 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ 88 పాయింట్ల లాభంతో 11,648 వద్దకు చేరింది. ఒడుదొడుకులు ఎదురైనా సూచీలు ఈ వారమంతా లాభాలనే నమోదు చేయడం గమనార్హం.
అంతర్జాతీయ మార్కెట్ల సానుకూలతలకు తోడు.. ఆర్థిక షేర్లు రాణించడం శుక్రవారం లాభాలకు ప్రధాన కారణం.
కరోనా సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెక్కించేందుకు రెండో దశ ప్యాకేజీ సహా.. పలు సంస్కరణలు తీసుకువచ్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తుందన్న వార్తలు మదుపరుల సెంటిమెంట్‌ను బలపరిచినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
ఇంట్రాడే సాగిందిలా
సెన్సెక్స్ 39,580 పాయింట్ల అత్యధిక స్థాయి, 39,235 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 11,686 పాయింట్ల గరిష్ఠ స్థాయి;11,589 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాల్లోనివి ఇవే..