తెలంగాణ

telangana

ETV Bharat / business

సెంటిమెంటు దెబ్బతింది... స్టాక్స్ మార్కెట్ కుదేలైంది

స్టాక్ ​మార్కెట్లు ఇవాళ భారీ నష్టాలతో ముగిశాయి. బ్యాంకింగ్, ఐటీ, లోహ​ రంగాల షేర్ల భారీ అమ్మకాలు, విదేశీ నిధుల ఉపసంహరణ మార్కెట్​ సెంటిమెంటును దెబ్బతీయడమే ఇందుకు కారణం. ఒకానొక దశలో సెన్సెక్ 37 వేల మార్కు దిగువకు పడిపోయింది. నిఫ్టీ 11 వేల మార్కును కోల్పోయి 10 వేల 980 వద్ద స్థిరపడింది.

అమ్మకాల ఒత్తిడితో మార్కెట్లకు భారీ నష్టాలు

By

Published : Aug 1, 2019, 5:09 PM IST

బ్యాంకింగ్,ఐటీ​, లోహ రంగాల్లో అమ్మకాల ఒత్తిడితో స్టాక్​మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. విదేశీ నిధుల ఉపసంహరణ, త్రైమాసిక ఫలితాల్లో తగ్గుదల మార్కెట్​ సెంటిమెంట్​ను దెబ్బతీశాయి.

ఒక దశలో బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ- సెన్సెక్స్ 37 వేల మార్కును కోల్పోయింది. మార్చి 14 తరువాత ఇలా జరగడం ఇదే తొలిసారి. సెషన్​ చివరికి 463 పాయింట్ల నష్టంతో 37 వేల 18 వద్ద ట్రేడింగ్​ ముగించింది.

జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ- నిఫ్టీ 11 వేల మార్కు దిగువకు పడిపోయింది. సెషన్​ ముగిసే సరికి 138 పాయింట్లు క్షీణించి.. 10 వేల 980 వద్ద స్థిరపడింది.

లాభనష్టాల్లోనివివే....

వేదాంత, టాటా మోటర్స్, ఎస్​బీఐ, భారతీ ఎయిర్​టెల్​, ఇన్ఫోసిస్​ నష్టాలపాలయ్యాయి. 4.5 శాతంపైగా కోల్పోయాయి. మారుతీ, పవర్​గ్రిడ్​, రిలయన్స్, బజాజ్​ ఆటో, హీరో మోటోకార్ప్, హెచ్​యూఎల్​, ఎన్​టీపీసీ (1.86 శాతం) లాభాలను నమోదు చేశాయి.

సెంటిమెంట్​ను దెబ్బతీశాయి..

చమురు సంబంధిత రంగాలు, సిమెంట్​ రంగాల్లో మందగమనం, జూన్​లో ఎనిమిది ప్రధాన పరిశ్రమల వృద్ధి 0.2 శాతానికి పడిపోయినట్లు కేంద్ర గణాంకాలు వెల్లడించడం వల్ల పెట్టుబడిదారులు డీలాపడ్డారు. జులైలో వాహన తయారీ రంగం కూడా నిరాశపూరిత ఫలితాలను నమోదుచేసింది.

దీనికి తోడు ప్రభుత్వ ఆర్థికలోటు జూన్​ త్రైమాసికంలో రూ.4.32 లక్షల కోట్లకు చేరుకుంది. ఇది 2019-20 ఆర్థిక సంవత్సర బడ్జెట్​ అంచనాల్లో 61.4 శాతం.
యూఎస్​ ఫెడ్ రిజర్వ్​ రేటు తగ్గుదల

అమెరికా ఫెడరల్​ రిజర్వ్ రుణ రేటును 25 శాతం తగ్గించింది. దీనితో వడ్డీ రేట్లు శ్రేణి 2.0 - 2.25కు తగ్గింది. 2008 ఆర్థిక సంక్షోభం తరువాత ఫెడరల్​ రిజర్వ్​ ఇలా రుణరేటు తగ్గించడం ఇదే తొలిసారి.

ఆసియా మార్కెట్లు

ఇతర ఆసియా మార్కెట్లలో షాంఘై కాంపోజిట్​ ఇండెక్స్, హాంగ్​ సెంగ్, కోస్పీ నష్టాల్లో ముగియగా... నిక్కీ స్వల్ప లాభాలతో గట్టెక్కింది.

రూపాయి విలువ

డాలర్​తో పోల్చితే రూపాయి విలువ 26 పైసలు తగ్గి రూ.69.06గా ఉంది.

ఇదీ చూడండి: కుదేలవుతున్న కేఫ్​ కాఫీ డే షేర్లు

ABOUT THE AUTHOR

...view details