తెలంగాణ

telangana

ETV Bharat / business

నగారా మోగింది..జోరు పెరిగింది.!

స్టాక్​ మార్కెట్లు  లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్​ 250 పాయింట్లకు పైగా లాభపడింది. నిఫ్టీ 80 పాయింట్లకు పైగా  వృద్ధి సాధించింది. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్​ ప్రకటన మార్కెట్లపై సానుకూల ప్రభావం చూపింది.

నగారా మోగింది..జోరు పెరిగింది

By

Published : Mar 11, 2019, 10:31 AM IST

Updated : Mar 11, 2019, 12:22 PM IST

స్టాక్ మార్కెట్లు లాభాల బాటలో పయనిస్తున్నాయి. సెన్సెక్స్​ 280 పాయింట్లు మెరుగుపడి 37వేల పాయింట్లకు చేరువలో ఉంది. నిఫ్టీ 80 పాయింట్లు వృద్ధి చెంది 11వేల 126 వద్ద ట్రేడ్ అవుతోంది.

ఈసీ సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్​ ప్రకటించింది. ఈ ప్రకటన మార్కెట్లపై సానుకూల ప్రభావం చూపింది. మదుపరులు కొనుగోళ్లపై ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ జోరు ఇలాగే కొనసాగే అవకాశం ఉందని మార్కెట్​ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

బ్యాంకింగ్, లోహము, ఇందన రంగాల షేర్లు ఒక శాతానిగి పైగా లాభాలను ఆర్జించాయి.

ఎన్టీపీసీ, ఇండస్ఇండ్​, సిప్లా, టెక్ మహింద్రా షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ 18 పైసలు మెరుగుపడి 69.88గా ఉంది.

Last Updated : Mar 11, 2019, 12:22 PM IST

ABOUT THE AUTHOR

...view details