తెలంగాణ

telangana

ETV Bharat / business

వీడని భయాలు- సెన్సెక్స్ 885 పాయింట్లు పతనం

అంతర్జాతీయ ప్రతికూలతలు, ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడంపై మదుపర్లలో అనుమానాలు... దేశీయ మార్కెట్లను భారీగా నష్టాల పాల్జేశాయి. సెన్సెక్స్ 885 పాయింట్లు, నిఫ్టీ 242 పాయింట్లు మేర నష్టపోయాయి.

By

Published : May 14, 2020, 3:41 PM IST

Sensex slumps over 882 pts ; Nifty tanks 241
భారీగా నష్టపోయిన దేశీయ మార్కెట్లు

అంతర్జాతీయ ప్రతికూలతలు, కేంద్రప్రభుత్వ ఆర్థిక ప్యాకేజీ పూర్తి వివరాల ప్రకటనకు ముందు మదుపరులు ఆచితూచి వ్యవహరిస్తుండడం వల్ల దేశీయ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. కరోనా మహమ్మారి ఇప్పడిప్పుడు ప్రపంచాన్ని విడిచిపెట్టదన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు కూడా దీనికి తోడయ్యాయి. ఫలితంగా ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఏ దశలోనూ మార్కెట్లు కోలుకోలేదు.

బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 885 పాయింట్లు నష్టపోయి 31 వేల 122 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 240 పాయింట్లు కోల్పోయి 9 వేల 142 వద్ద స్థిరపడింది.

లాభనష్టాల్లో..

హీరో మోటోకార్ప్, ఎల్​ అండ్​ టీ, ఆల్ట్రాటెక్ సిమెంట్, మారుతి సుజుకి, సన్​ఫార్మా రాణించాయి.

ఇన్ఫోసిస్, హెచ్​డిఎఫ్​సీ ట్విన్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్, టెక్​ మహీంద్ర, ఎన్​టీపీసీ, ఎస్​బీఐ నష్టపోయాయి.

ఇదీ చూడండి:రెండోరోజు 'ఉద్దీపన'లపై కోటి ఆశలు!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details