తెలంగాణ

telangana

ETV Bharat / business

వృద్ధిపై మదుపరుల భయాలు.. 11 వేల దిగువనే నిఫ్టీ

దేశీయ స్టాక్​మార్కెట్లు.. నేడు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలతో సెన్సెక్స్​ 130 పాయింట్లకు పైగా పతనమైంది. నిఫ్టీ 11 వేల మార్కు దిగువనే ఉంది.

ప్రతికూలతల నడుమ మార్కెట్లకు భారీ నష్టాలు

By

Published : Aug 16, 2019, 10:08 AM IST

Updated : Sep 27, 2019, 4:08 AM IST

అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు మార్కెట్లను కలవరపెడుతున్నాయి. శుక్రవారం ఆరంభ ట్రేడింగ్​లో బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్​- 300 పాయింట్లకు పైగా పతనమైంది. ప్రస్తుతం.. 130 పాయింట్ల నష్టంతో 37 వేల 180 వద్ద ట్రేడవుతోంది.

జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 43 పాయింట్లు క్షీణించి.. 10 వేల 986 వద్ద ఉంది. ఆటో, ఐటీ, లోహ, బ్యాంకింగ్​ రంగాలు భారీగా నష్టపోతున్నాయి. కొనుగోళ్లూ క్షీణించాయి.

స్టాక్​మార్కెట్లు గత సెషన్​(బుధవారం)లో భారీగా లాభాలను నమోదుచేయడం గమనార్హం. సెన్సెక్స్​ 353, నిఫ్టీ 104 పాయింట్ల మేర మెరుగుపడ్డాయి.

ఆర్థిక వ్యవస్థ మందగమనం, అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం మదుపరుల మనోభావాలను దెబ్బతీసిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మోదీ-నిర్మలా భేటీ..

దేశ ప్రస్తుత ఆర్థిక వ్యవస్థపై ప్రధాని నరేంద్రమోదీ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​తో సమగ్ర సమీక్ష నిర్వహించారు. వృద్ధి వేగంగా మందగమనానికిలోనై.. ఉద్యోగాల కోత, సంపద ఆవిరికి కారణమవుతున్న రంగాలను గాడిలో పెట్టేందుకు అవసరమైన పరిష్కారాల గురించి సమాలోచనలు చేశారు.

లాభనష్టాల్లోనివివే....

యెస్​ బ్యాంకు, ఓఎన్​జీసీ, ఐటీసీ, బజాజ్​ ఫైనాన్స్​, కోల్​ ఇండియా, ఇన్ఫోసిస్​, సన్​ ఫార్మాలు 1.37 శాతం మేర రాణించాయి.

హీరో మోటోకార్ప్​, మారుతీ సుజుకీ, వేదాంత, హెచ్​సీఎల్​, భారతీ ఎయిర్​టెల్​, టాటా స్టీల్​, టాటా మోటార్స్​ డీలా పడ్డాయి. టాటా మోటార్స్​ షేర్లు 2.6 శాతం మేర పడిపోయాయి.

రూపాయి...

శుక్రవారం ట్రేడింగ్​లో రూపాయి స్వల్పంగా 16 పైసలు క్షీణించింది. డాలర్​తో పోలిస్తే ప్రస్తుతం మారకం విలువ 71.43గా ఉంది.

Last Updated : Sep 27, 2019, 4:08 AM IST

ABOUT THE AUTHOR

...view details