వరుస లాభాలతో స్టాక్ మార్కెట్లు సరికొత్త రికార్డులు సృష్టించాయి. బుధవారం సెషన్లో బీఎస్ఈ-సెన్సెక్స్ 458 పాయింట్లు బలపడి చరిత్రలో తొలిసారి 50,256 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ 142 పాయింట్లకుపైగా పెరిగి జీవనకాల గరిష్ఠమైన 14,790 వద్దకు చేరింది.
బడ్జెటోత్సాహం, అంతర్జాతీయ సానుకూలతలు లాభాలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. బ్యాంకింగ్, ఫార్మా షేర్లు లాభాల్లో ప్రధానంగా ఉన్నాయి.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ 50,526 పాయింట్ల అత్యధిక స్థాయి (జీవనకాల గరిష్ఠం), 49,515 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 14,868 పాయింట్ల గరిష్ఠ స్థాయి(సరికొత్త రికార్డు స్థాయి), 14,574 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాల్లోనివి ఇవే..
ఇండస్ఇండ్ బ్యాంక్, పవర్‌గ్రిడ్, డాక్టర్ రెడ్డీస్, సన్‌ఫార్మా, ఎన్టీపీసీ, టెక్ మహీంద్రా షేర్లు ఎక్కువగా లాభాలను గడించాయి.
ఐటీసీ, మారుతీ, అల్ట్రాటెక్ సిమెంట్, ఏషియన్ పెయింట్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, నెస్లే ఇండియా షేర్లు నష్టపోయాయి.
ఇతర మార్కెట్లు
ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లలో షాంఘై మినహా.. టోక్యో, కోస్పీ, హాంకాంగ్ సూచీలు లాభాలను నమోదు చేశాయి.
50 వేల వరకు సెన్సెక్స్ ప్రయాణం..
1,000 పాయింట్లు
1990 జులై 25న తొలిసారి ఈ మార్క్‌ను దాటింది సెన్సెక్స్. కార్పొరేట్ల ఫలితాలు ఆకర్షణీయంగా నమోదవటం, రుతుపవనాల సానుకూలతలు ఇందుకు కారణమయ్యాయి.
5000 పాయింట్లు
1999 అక్టోబర్ 11న ఈ స్థాయిని దాటింది సెన్సెక్స్. 13వ లోక్‌సభ ఎన్నికల్లో భాజపా కూటమి గెలుపొందటం ఇందుకు కలిసొచ్చింది.
10,000 పాయింట్లు
2006 ఫిబ్రవరి 6న ఈ స్థాయిని తాకింది. 10,000 మార్క్ ఎగువన స్థిరపడింది మాత్రం 2006 ఫిబ్రవరి 7.