స్టాక్ మార్కెట్లు గురువారం భారీ లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ 629 పాయింట్లు పుంజుకుని.. 38,697 వద్దకు చేరింది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ 169 పాయింట్ల లాభంతో 11,417 వద్ద సెషన్‌ను ముగించింది.
కేంద్రం విడుదల చేసిన అన్‌లాక్-5 మార్గదర్శకాల్లో మరిన్ని వాణిజ్య కార్యకలాపాలకు అనుమతులు లభించాయి. ఈ సానుకూలతలతో మదుపరులు భారీగా కొనుగోళ్లకు దిగటం లాభాలకు కారణంగా తెలుస్తోంది. బ్యాంకింగ్, ఆటో, ఐటీ షేర్లు లాభాలకు దన్నుగా నిలిచాయి.
సెప్టెంబర్‌లో వాహన రంగం సానుకూలంగా వృద్ధి నమోదు చేయడం వల్ల ఆటో షేర్లు భారీగా పుంజుకున్నాయి. అక్టోబర్ 15 నుంచి సినిమా హాళ్లు తెరిచేందుకు అనుమతులు లభించిన నేపథ్యంలో పీవీఆర్, ఐనాక్స్ షేర్లు కూడా గురువారం భారీగా లాభపడ్డాయి.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ 38,739 పాయింట్ల అత్యధిక స్థాయి, 38,410(సెషన్ ప్రారంభ స్థాయి) పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 11,426 పాయింట్ల గరిష్ఠ స్థాయి;11,347 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాల్లోనివి ఇవే..