దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ప్రధాని మోదీ ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల భారీ ప్యాకేజీ మార్కెట్లను పరుగులు పెట్టిస్తోంది.
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 664 పాయింట్లు లాభపడి 32 వేల 35 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 188 పాయింట్లు వృద్ధిచెంది 9 వేల 385 వద్ద ట్రేడవుతోంది.
మార్కెట్లకు ప్యాకేజీ ఊపు
దేశ జీడీపీలో 10 శాతం అంటే రూ.20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ ప్రకటించిన ప్రధాని మోదీ.. స్థానికతకు, ఆధునిక సాంకేతికతకు పెద్దపీట వేయనున్నామని స్పష్టం చేశారు. ఈ ప్రకటన మదుపర్ల సెంటిమెంటును పెంచింది. మరోవైపు నేడు ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించనున్న నేపథ్యంలో మదుపర్లు వాటిపై దృష్టి సారించారు. ఫలితంగా ప్రారంభ ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 1,400 పాయింట్ల వరకు పెరిగింది.
లాభనష్టాల్లో..
ఐసీఐసీఐ బ్యాంకు 7 శాతం వరకు లాభపడి అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఎల్ అండ్ టీ, యాక్సిస్ బ్యాంకు, బజాజ్ ఫైనాన్స్, హీరో మోటోకార్ప్, ఎమ్ అండ్ ఎమ్, ఆల్ట్రాటెక్ సిమెంట్, మారుతి సుజుకి రాణిస్తున్నాయి.
నెస్లే ఇండియా, భారతీ ఎయిర్టెల్, సన్‌ఫార్మా, రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్, విప్రో నేలచూపులు చూస్తున్నాయి.
ఆసియా మార్కెట్లు..