తెలంగాణ

telangana

ETV Bharat / business

అమ్మకాల ఒత్తిడితో నష్టాల్లో స్టాక్​ మార్కెట్లు

జులై డెరివేటివ్​ కాంట్రాక్టుల ముగింపు అనంతరం.. స్టాక్​మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్​లో నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్​ 90 పాయింట్లకు పైగా కోల్పోయింది. నిఫ్టీ 11 వేల 250 మార్కు దిగువకు చేరింది.

అమ్మకాల ఒత్తిడితో నష్టాల్లో స్టాక్​మార్కెట్లు

By

Published : Jul 26, 2019, 10:17 AM IST

ఆగస్టు ఎఫ్​ అండ్​ ఓ సిరీస్​ మొదటిరోజు స్టాక్​మార్కెట్లు నష్టాల బాటపట్టాయి. అమ్మకాల ఒత్తిడితో ఆరంభ ట్రేడింగ్​లో సెన్సెక్స్​ 90 పాయింట్లకు పైగా పతనమైంది. నిఫ్టీ 11 వేల 250 మార్కును కోల్పోయింది. లోహ, ఆటో, విద్యుత్తు, బ్యాంకింగ్​, ఐటీ రంగాలన్నింటిలో కొనుగోళ్లు క్షీణించాయి. అంతర్జాతీయంగా బలహీన సంకేతాలూ నష్టాలకు ఓ కారణం.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్​ 91 పాయింట్లు కోల్పోయి.. ప్రస్తుతం 37 వేల 740 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 26 పాయింట్ల స్వల్ప నష్టంతో.. 11 వేల 226 వద్ద కొనసాగుతోంది.

శుక్రవారం నాటి ఆరంభ ట్రేడింగ్​లో మొత్తం 312 షేర్లు పుంజుకున్నాయి. మరో 384 షేర్లు క్షీణించాయి. 30 షేర్లలో ఎలాంటి మార్పు లేదు.

లాభనష్టాల్లోనివివే...

బయోకాన్​, సౌత్​ ఇండియన్​ బ్యాంక్​, వేదాంత, యస్​ బ్యాంక్​, ఇండియా బుల్స్​ హౌసింగ్​, భారతీ ఇన్​ఫ్రాటెల్​, కోల్​ ఇండియా లాభాలతో ప్రారంభమయ్యాయి. బయోకాన్​ షేర్లు 6 శాతం మేర పుంజుకున్నాయి.

జేఎస్​డబ్ల్యూ స్టీల్​, పీవీఆర్​, బజాజ్​ ఫినాన్స్​, టాటా మోటార్స్​, బజాజ్​ ఫిన్​సర్వ్​, ఐఓసీ, డాక్టర్​ రెడ్డీస్​, ఇన్ఫోసిస్​, హెచ్​సీఎల్​ టెక్​, ఓఎన్​జీసీలు నష్టాలను నమోదు చేశాయి.

రూపాయి...

ఆరంభ ట్రేడింగ్​లో రూపాయి స్వల్పంగా 8 పైసలు కోల్పోయింది. డాలర్​తో పోలిస్తే మారకం విలువ 69.04 వద్ద ఉంది.

ABOUT THE AUTHOR

...view details