తెలంగాణ

telangana

ETV Bharat / business

ఎన్​పీఏల భయంతో ఒడుదొడుకుల్లో మార్కెట్లు

దేశీయ స్టాక్​మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. బ్యాంకుల ఎన్​పీఏలు పెరగడం, చిల్లర ద్రవ్యోల్బణం ఐదున్నరేళ్ల గరిష్ఠానికి చేరుకోవడం వల్ల మదుపరుల సెంటిమెంటు దెబ్బతినడమే ఇందుకు కారణం.

Sensex, Nifty off to choppy start
ఎన్​పీఏల భయంతో ఒడుదొడుకుల్లో మార్కెట్లు

By

Published : Jan 17, 2020, 9:58 AM IST

బ్యాంకుల స్థూల నిరర్ధక ఆస్తులు (ఎన్​పీఏలు) పెరగడం, చిల్లర ధరల ఆధారిత ద్రవ్యోల్బణం ఐదున్నరేళ్ల గరిష్ఠానికి చేరుకోవడం మార్కెట్ సెంటిమెంట్​ను దెబ్బతీసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్​, టీసీఎస్, హెచ్​సీఎల్ టెక్ తమ త్రైమాసిక ఫలితాలు విడుదల చేయనున్న నేపథ్యంలో మదుపరులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఫలితంగా నేడు దేశీయ స్టాక్​మార్కెట్లు స్వల్ప నష్టాలతో ట్రేడవుతున్నాయి.

బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 13 పాయింట్లు కోల్పోయి 41 వేల 945 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 2 పాయింట్లు నష్టపోయి 12 వేల 352 వద్ద ట్రేడవుతోంది.

లాభనష్టాల్లో

భారతీ ఎయిర్​టెల్, రిలయన్స్, డా.రెడ్డీ ల్యాబ్స్, టాటా స్టీల్, విప్రో, టీసీఎస్​, నెస్లే రాణిస్తున్నాయి

భారతీ ఇన్​ఫ్రాటెల్, ఎస్ బ్యాంకు, ఇండస్​ఇండ్ బ్యాంకు, ఎస్​బీఐ, గెయిల్​, హెచ్​డీఎఫ్​సీ బ్యాంకు, హెచ్​డీఎఫ్​సీ, పవర్ గ్రిడ్ కార్ప్ నష్టాల్లో కొనసాగుతున్నాయి.

ఆసియా మార్కెట్లు

అమెరికా-చైనా మధ్య మొదటి దఫా వాణిజ్య ఒప్పందం విజయవంతం అయిన నేపథ్యంలో వాల్​ స్ట్రీట్ భారీ లాభాలను మూటగట్టుకుంది. ప్రస్తుతం ఆసిమా మార్కెట్లలో నిక్కీ, కోస్పీ, షాంగై కాంపోజిట్ లాభాల్లో ట్రేడవుతుండగా, హాంగ్​ సెంగ్ నష్టాల్లో కొట్టుమిట్టాడుతోంది.

రూపాయి విలువ

రూపాయి విలువ 5 పైసలు, ఒక డాలరుకు రూ.70.98గా ఉంది.

ముడిచమురు ధర

ప్రపంచ మార్కెట్​లో ముడిచమురు ధర 0.05 శాతం తగ్గింది. ప్రస్తుతం బ్యారెల్ ధర 64.59 డాలర్లుగా ఉంది.

ఇదీ చూడండి: చిన్న మొత్తాల పొదుపుపై మరింతగా పన్ను రాయితీలు!

ABOUT THE AUTHOR

...view details