వారాంతపు సెషన్లో స్టాక్ మార్కెట్లు మిశ్రమంగా(దాదాపు ఫ్లాట్గా) ముగిశాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ స్వల్పంగా 13 పాయింట్ల లాభంతో 51,544 (కొత్త రికార్డ్) వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ 10 పాయింట్లు కోల్పోయి 15,163 వద్ద ముగిసింది.
బ్యాంకింగ్, ఐటీ షేర్లు లాభాలను గడించగా.. ఎఫ్ఎంసీజీ, లోహ షేర్లు డీలా పడ్డాయి.
ఇంట్రాడే సాగిందిలా
సెన్సెక్స్ 51,804 పాయింట్ల అత్యధిక స్థాయి: 51,260 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 15,243 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 15,081 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.