ఉగాది పర్వదినాన (మంగళవారం) స్టాక్ మార్కెట్లు భారీ లాభాలను గడించాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ 661 పాయింట్లు పెరిగి 48,544 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ 194 పాయింట్ల లాభంతో 14,505 వద్దకు చేరింది.
ఇటీవలి భారీ నష్టాల నుంచి ఆర్థిక షేర్లు వేగంగా రికవరీ అవడం లాభాలకు కారణంగా విశ్లేషకులు చెబుతున్నారు. వాహన షేర్లు కూడా దన్నుగా నిలిచినట్లు పేర్కొన్నారు. దేశంలో మరో కొవిడ్ టీకా (స్పుత్నిక్-వి) అత్యవసర వినియోగ అనుమతులు పొందడం మదుపరుల్లో సానుకూలతలు పెంచినట్లు వెల్లడించారు.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ 48,627 పాయింట్ల అత్యధిక స్థాయి, 47,775 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 14,528 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 14,274 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.