తెలంగాణ

telangana

ETV Bharat / business

అంతర్జాతీయ ఆర్థిక వృద్ధిపై ఆందోళనలతో...

అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల పరిస్థితుల మధ్య స్టాక్​మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

అంతర్జాతీయ ఆర్థిక వృద్ధిపై ఆందోళనలతో...

By

Published : Feb 11, 2019, 10:51 AM IST

అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం ప్రకంపనలకు తోడు, అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూలతలతో దేశీయ స్టాక్​ మార్కెట్లు నష్టపోయాయి.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ- సెన్సెక్స్​ 159 పాయింట్ల నష్టంతో 36వేల 386కు చేరుకుంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి​ సూచీ- నిఫ్టీ 61 పాయింట్లు కోల్పోయి 10వేల 882 వద్ద ట్రేడవుతోంది.

లాభాలు- నష్టాలు...

ఆటో, బ్యాంకింగ్​, ఫార్మా రంగాలు నష్టాల బాట పట్టాయి. వేదాంత, హీరో మోటోకార్ప్​, కోల్​ ఇండియా, యస్​ బ్యాంక్​, ఐసీఐసీఐ బ్యాంక్​, మారుతీ సుజుకి, బజాజ్​ ఆటో నష్టపోయిన సంస్థల జాబితాలో ఉన్నాయి.

టాటా స్టీల్​, కొటక్​ బ్యాంక్​, ఇన్ఫోసిస్​, టీసీఎస్​, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​ లాభాల్లో కొనసాగుతున్నాయి.

బలపడిన రూపాయి...

వరుసగా ఐదోరోజు రూపాయి విలువ బలపడింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల తగ్గుదల ఇందుకు కారణమైంది. డాలర్​తో పోలిస్తే 9 పైసలు పెరిగింది. ప్రస్తుతం మారకం విలువ 71.22 వద్ద కొనసాగుతోంది.

ABOUT THE AUTHOR

...view details