స్టాక్ మార్కెట్లలో ఐదు రోజుల తర్వాత బేర్ దూకుడుకు అడ్డుకట్ట పడింది. మంగళవారం సెషన్లో బీఎస్ఈ-సెన్సెక్స్ అతి స్వల్పంగా 7 పాయింట్లు బలపడి 49,751 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ 32 పాయింట్ల లాభంతో 14,707వద్దకు చేరింది.
మిడ్ సెషన్లో భారీగా లాభాలు నమోదైనా.. చివరి గంటలో మదుపరులు అమ్మకాలపై దృష్టి సారించడం వల్ల సూచీలు ఫ్లాట్గా స్థిరపడినట్లు తెలుస్తోంది.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ 50,327 పాయింట్ల అత్యధిక స్థాయి, 49,659 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 14,854 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 14,651 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.