తెలంగాణ

telangana

ETV Bharat / business

ఐటీ, బ్యాంకింగ్​ రంగాల ఊతంతో లాభాల బాట

గత వారాంతంలో స్వల్ప లాభాల్లో ముగిసిన స్టాక్​మార్కెట్లు.. నేడి ట్రేడింగ్​ను సానుకూలంగా ప్రారంభించాయి. సెన్సెక్స్​ 200 పాయింట్లకు పైగా లాభపడింది. నిఫ్టీ 11 వేల 50 పాయింట్ల ఎగువన ఉంది. దేశీయ, అంతర్జాతీయ సానుకూలతలు లాభాలకు దోహదపడ్డాయి.

By

Published : Aug 19, 2019, 10:06 AM IST

Updated : Sep 27, 2019, 12:00 PM IST

ఐటీ, బ్యాంకింగ్​ రంగాల ఊతంతో లాభాల బాట

ఫార్మా, ఐటీ, బ్యాంకింగ్​, ఆటో, ఇన్​ఫ్రా, లోహ రంగాల్లో కొనుగోళ్ల ఊతంతో స్టాక్​మార్కెట్లు లాభాల బాట పట్టాయి. ఈ వారం మొదటి సెషన్​ మంచి లాభాలతో ప్రారంభమైంది. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్​ ఆరంభ ట్రేడింగ్​లో 250 పాయింట్లకు పైగా లాభాల్లో ట్రేడైంది. ప్రస్తుతం.. 210 పాయింట్లు పెరిగి 37 వేల 562 వద్ద కొనసాగుతోంది.

జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ- నిఫ్టీ 60 పాయింట్ల లాభంలో ఉంది. 11 వేల 107 వద్ద కొనసాగుతోంది.

దేశీయంగా, అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు లాభాలకు ఓ కారణం. ఆసియా మార్కెట్లన్నీ మంచి ఫలితాల్ని సాధిస్తున్నాయి.

లాభనష్టాల్లోనివివే....

భారతీ ఇన్​ఫ్రాటెల్​, టెక్​ మహీంద్రా, ఎన్​టీపీసీ, ఎల్​ అండ్​ టీ, హెచ్​సీఎల్​ టెక్​, ఆర్​ఐఎల్​, సన్​ ఫార్మా, భారతీ ఎయిర్​టెల్​, ఐటీసీ, టీసీఎస్​, ఇండియాబుల్స్​ హెచ్​ఎస్​జీలు పుంజుకున్నాయి. 3 శాతంపైగా లాభాలను నమోదుచేశాయి.

ఎస్​ బ్యాంక్​, పవర్​ గ్రిడ్​ కార్పొరేషన్​, గ్రాసిమ్​, ఎస్​బీఐ, టాటా స్టీల్​, వేదాంత, ఓఎన్​జీసీ, గెయిల్​లు ఆరంభ ట్రేడింగ్​లోనే డీలాపడ్డాయి.

రూపాయి...

నేడి ట్రేడింగ్​లో రూపాయి స్వల్పంగా 8 పైసలు మెరుగుపడింది. డాలర్​తో పోలిస్తే మారకం.. విలువ 71.06 వద్ద ఉంది.

Last Updated : Sep 27, 2019, 12:00 PM IST

ABOUT THE AUTHOR

...view details