డిసెంబర్ 24 న మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ మైనర్ల (18 ఏళ్ల కంటే తక్కువ వయసు) పేరుతో చేసే పెట్టుబడులకు సంబంధించి ఒక సర్క్యులర్ జారీ చేసింది. ఈ పెట్టుబడులు కేవలం మైనర్ పేరుతో ఉన్న బ్యాంకు ఖాతా నుంచి గానీ లేదా తల్లిదండ్రులు లేదా సంరక్షకుడితో కలిపి ఉన్న ఉమ్మడి ఖాతా నుంచి కానీ చేసి ఉండాలని చెప్పింది. ఇంతకుముందు సంరక్షకుడి ఖాతా నుంచి పెట్టుబడులకు కూడా అనుమతి ఉండేది.
విత్‌డ్రా ఇబ్బందులు
అయితే ఇలాంటి ఖాతాల నుంచి నగదు విత్‌డ్రా చేసుకునేటప్పుడు ఇబ్బందులు వస్తున్నాయి. ముఖ్యంగా జాతీయ బ్యాంకుల ఖాతాల విషయంలో సమస్యలు వస్తున్నాయని ఆర్థిక సలహాదారులు చెప్తున్నారు. ఇప్పటికే ఉన్న ఇలాంటి పెట్టుబడుల ఉపసంహరణ కోసం మ్యూచువల్ ఫండ్ సంస్థలు దీనిని తప్పనిసరి చేయాలని సూచించింది.
అప్‌డేట్ చేసుకోవాల్సిందే
సెబీ సర్క్యులర్ ప్రకారం, మైనర్లకు మెజారిటీ (18 ఏళ్లు) వచ్చిన తర్వాత కేవైసీ, బ్యాంకు ఖాతా వివరాలను (క్యాన్సిల్ అయిన చెక్కుతో సహా) తప్పనిసరిగా అప్‌డేట్ చేయాలి. అప్పటివరకు సిప్, సిస్టమేటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ (ఎస్‌డబ్ల్యూపీ), సిస్టమేటిక్ ట్రాన్స్‌ఫర్ ప్లాన్‌లలో (ఎస్‌టీపీ) పెట్టుబడులు రద్దు అవుతాయి. అప్‌డేట్ చేసిన తర్వాతే పెట్టుబడులు పెట్టేందుకు వీలుంటుంది.
ఈ పత్రాలు తప్పనిసరి
దీంతో పాటు సర్క్యులర్‌లో సెబీ, మ్యూచువల్ ఫండ్ సంస్థలు ఒకే విధమైన ట్రాన్స్‌మిషన్ రిక్వెస్ట్ ఫారం, నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ (ఎన్ఓసీ), యూనిట్ల బదిలీ కోసం అవసరమైన పత్రాలను కలిగి ఉండాలని కోరింది. అవసరమైన అన్ని ఫారమ్‌లు, ఫార్మాట్లను ఏఎమ్‌సీలు, ఆర్టీఏలు (రిజిస్ట్రార్ అండ్ ట్రాన్స్ఫర్ ఏజెంట్లు) సీఏఎమ్ఎస్, కేఫిన్ టెక్, అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఆఫ్ ఇండియా (ఏఎమ్ఎఫ్ఐ) వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంచాలి.
ట్రాన్స్‌మిషన్ పూర్తి చేసిన తర్వాతే ఉపసంహరణ అభ్యర్థనను అంగీకరించాల్సిందిగా సూచించింది. ట్రాన్స్‌మిషన్ సమయంలో క్లెయిమ్ చేయని నిధులు, డివిడెండ్లను బదిలీ చేయడానికి ఏఎమ్‌సీలు ఏకరీతి ప్రక్రియను అవలంబించాలి. ట్రాన్స్‌మిషన్ సమయంలో నష్టపరిహార బాండ్లు, అఫిడవిట్లపై హక్కుదారు చెల్లించాల్సిన స్టాంప్ డ్యూటీ చట్టం ప్రకారం ఉంటుంది. సర్క్యులర్ జారీ చేసిన 30 రోజుల్లోపు (జనవరి 24, 2020) క్లెయిమ్ చేయని వాటి కోసం ఒకే రకమైన ఫారం, డాక్యుమెంట్లు వంటివి సిద్ధం చేయాలని యాంఫీని కోరింది.
ఇదీ చూడండి:రియల్మీ ఎక్స్2 ప్రో స్మార్ట్‌ఫోన్ ఇక మరింత చౌక!