మారటోరియం సమయంలో రుణాల వడ్డీపై వడ్డీకి సంబంధించిన పిటిషన్ల విచారణను ఈ నెల 5కు(గురువారం) వాయిదా వేసింది సుప్రీంకోర్టు. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకుంది.
గురువారం(ననంబర్ 5) నాటికి బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, బ్యాంకింగ్యేతర సంస్థలు.. 2కోట్ల లోపు రుణాలు తీసుకున్న రుణ గ్రహీతల ఖాతాలో నగదును జమ చేస్తాయని రిజర్వు బ్యాంకు, ఆర్థికశాఖ ఇప్పటికే అత్యున్నత న్యాయస్థానంలో అదనపు అఫిడవిట్‌ను దాఖలు చేశాయి.