తెలంగాణ

telangana

ETV Bharat / business

డా.రెడ్డీస్​కు 10 కోట్ల రష్యా టీకా డోసులు

స్పుత్నిక్​-వీకు చెందిన 10 కోట్ల డోసులును భారత్​లోని డా. రెడ్డీస్​ ల్యాబొరేటరీకి రష్యా సరఫరా చేయనుంది. దీనిపై ఆర్​డీఐఎఫ్(రష్యా ప్రత్యక్ష పెట్టుబడుల నిధి)తో డా. రెడ్డీస్​ ల్యాబ్​కు ఒప్పందం కుదిరింది. ప్రస్తుతం భారత ప్రభుత్వం నుంచి అందాల్సిన అనుమతుల కోసం రష్యా ఎదురుచూస్తోంది.

Russia likely to supply 100 million doses of Sputnik-V vaccine to India
భారత్​కు 10కోట్ల స్పుత్నిక్​-వీ డోసులు!

By

Published : Sep 16, 2020, 3:29 PM IST

Updated : Sep 16, 2020, 4:38 PM IST

భారత్​లో.. స్పుత్నిక్​-వీ క్లినికల్​ ట్రయల్స్​తో పాటు 10 కోట్ల టీకా డోసుల సరఫరాకు ఆర్​డీఐఎఫ్​(రష్యా ప్రత్యక్ష పెట్టుబడుల నిధి)- డా. రెడ్డీస్​ ల్యాబొరేటరీ మధ్య ఒప్పందం కుదిరింది. భారత ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చిన వెంటనే.. 10 కోట్ల డోసులను రెడ్డీస్​ ల్యాబ్​కు ఆర్​డీఐఎఫ్​ సరఫరా చేయనుంది. 2020 చివరి నాటికి ఈ ప్రక్రియ మొదలయ్యే అవకాశముంది.

ఈ ఒప్పందంపై రెడ్డీస్​ ల్యాబ్​ కో-ఛైర్మన్​ జీవీ ప్రసాద్​ హర్షం వ్యక్తం చేశారు.

"భారత్​కు వ్యాక్సిన్​ను తీసుకొచ్చేందుకు ఆర్​డీఐఎఫ్​తో చేతులు కలపడం ఎంతో సంతోషంగా ఉంది. తొలి రెండు దశల క్లినికల్​ ట్రయల్స్​ మంచి ఫలితాల్ని ఇచ్చాయి. వ్యాక్సిన్​ భద్రత, భారత జనాభాపై వ్యాక్సిన్​ ఏ విధంగా పనిచేస్తుందో తెలుసుకునేందుకు మూడో దశ క్లినికల్ ట్రయల్స్​ను మేము నిర్వహిస్తాం. దేశంలో కరోనాపై పోరుకు స్పుత్నిక్​-వీ ఓ ఆశాకిరణంగా మారే అవకాశముంది."

--- జీవీ ప్రసాద్​, రెడ్డీస్​ ల్యాబ్​ కో-ఛైర్మన్​.

ఆర్​డీఐఎఫ్​ ఇప్పటికే.. కజికిస్థాన్‌, బ్రెజిల్‌, మెక్సికోకు రష్యన్‌ వ్యాక్సిన్‌ స్పుత్నిక్‌-వీని అందించేందుకు ఒప్పందాలు కుదుర్చుకుంది.

ఇదీ చూడండి:-ప్రజా పంపిణీకి రష్యా​ వ్యాక్సిన్- తొలిబ్యాచ్​ విడుదల

Last Updated : Sep 16, 2020, 4:38 PM IST

ABOUT THE AUTHOR

...view details