కరోనా టీకా కొవిషీల్డ్ ఉత్పత్తి పెంచడానికి తమకు రూ. 3వేల కోట్లు అవసరమని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) సీఈఓ అదార్ పూనావాలా తెలిపారు. 'ఇదేమీ చిన్నమొత్తం కాదు. ఇప్పటికే వేల కోట్లు ఖర్చు చేశాం. అందువల్ల ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నాం' అని ఆయన వివరించారు.
'టీకా ఉత్పత్తి పెంపునకు రూ. 3వేల కోట్లు అవసరం'
కొవిషీల్డ్ టీకా ఉత్పత్తికి మరో రూ. 3వేల కోట్లు అవసరమని సీరం సీఈఓ అదార్ పూనావాలా పేర్కొన్నారు. ఇందుకోసం ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నట్లు తెలిపారు.
'టీకా ఉత్పత్తి పెంపునకు రూ. 3వేల కోట్లు అవసరం'
ఈ ఏడాది జూన్ నుంచి నెలకు 11 కోట్ల డోసుల కొవిషీల్డ్ టీకా తయారు చేయగలమని తెలిపారు. ప్రస్తుతం కంపెనీ రోజుకు 20 లక్షల డోసులు తయారు చేస్తోంది. ఇప్పటి వరకు దేశీయ అవససరాలకు 10 కోట్ల డోసుల టీకా అందించినట్లు, అదే సమయంలో ఇతర దేశాలకు 6 కోట్ల డోసుల టీకా సరఫరా చేసినట్లు వివరించారు.
ఇదీ చూడండి:కొవిషీల్డ్ వినియోగ కాలపరిమితి పెంపు