తెలంగాణ

telangana

ETV Bharat / business

వాట్సాప్‌లో జియోమార్ట్​ సేవలు ప్రారంభం

వాట్సాప్ ద్వారా కిరాణా సరకులు కొనుగోలుకు వీలు కల్పించే జియోమార్ట్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ముంబయిలో ఈ సేవలు ప్రారంభించిన రిలయన్స్... త్వరలోనే ఇతర ప్రధాన నగరాలకు విస్తరించనుంది.

RELIANCE JIO MART SERVICES HAS LAUNCHED ON WHATS APP
వాట్సాప్‌లో ప్రారంభమైన జియోమార్ట్​ సేవలు

By

Published : Apr 26, 2020, 4:58 PM IST

అతిపెద్ద ఈ-కామర్స్‌ సంస్థగా అవతరించేందుకు ఫేస్‌బుక్‌తో భాగస్వామ్యమైన రిలయన్స్‌ రిటైల్‌.. వాట్సాప్‌లో పైలట్‌ ప్రాజెక్ట్‌గా జియో మార్ట్‌ సేవలను ప్రారంభించింది. రిలయన్స్‌ జియో ప్లాట్‌ఫామ్స్‌లో ఫేస్‌బుక్‌ పెట్టుబడులు పెట్టిన మూడు రోజులకే ఈ సేవలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ముంబయి పరిసరాల్లోని నవీ ముంబయి, ఠానే, కల్యాణ్‌ ప్రాంతాల్లో ఈ సేవలు లభ్యమవుతున్నాయి. ఇందుకోసం వాట్సాప్‌ వినియోగదారులు 88500 08000 నంబర్‌ను తమ ఫోన్‌లో సేవ్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

ఇప్పటికి క్యాష్​ ఆర్డర్లే..

ఆ నంబర్‌కు మీరు సందేశం పంపితే జియో మార్ట్‌ నుంచి మీ ఫోన్‌కు లింక్‌ వస్తుంది. అది కేవలం 30 నిమిషాలు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఆ లింక్‌పై క్లిక్‌ చేయడం ద్వారా మీకో పేజీ ఓపెన్‌ అవుతుంది. అందులో మీ అడ్రస్‌, ఫోన్‌ నంబర్‌ వంటి వివరాలు పొందుపరచాల్సి ఉంటుంది. ఆ తర్వాత అక్కడున్న వస్తువుల్లో మీకు కావాల్సిన వాటిని ఎంపిక చేసుకోవచ్చు.

మీ ఆర్డర్‌ పూర్తైన వెంటనే మీ మొబైల్‌కు సంబంధిత స్టోర్‌ వివరాలు వాట్సాప్‌ నంబర్‌కు పంపుతారు. మీ ఆర్డర్‌ సిద్ధమైన తర్వాత కూడా మీకో నోటిఫికేషన్‌ వస్తుంది. ప్రస్తుతం క్యాష్‌ ఆర్డర్లు మాత్రమే అనుమతిస్తున్నారు. పైగా స్టోర్‌కు వినియోగదారులే వెళ్లి తీసుకోవాల్సి ఉంటుంది.

వాటికి పోటీగా..

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు చెందిన రిలయన్స్‌ రిటైల్‌ లిమిటెడ్‌ గతేడాది డిసెంబర్‌లో ఈ-కామర్స్‌ విభాగం జియో మార్ట్‌ను నెలకొల్పింది. దీనికి 'దేశ్‌ కి నయీ దుకాణ్‌' అని పేరు పెట్టింది. అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ వంటి ఈ-కామర్స్‌ సంస్థలకు పోటీగా దీన్ని తీర్చిదిద్దేందుకు ఫేస్‌బుక్‌తో రిలయన్స్‌ చేతులు కలిపింది. త్వరలో మరిన్ని రాష్ట్రాలకు ఈ సేవలను తీసుకొస్తుందని, ఇందులో వాట్సాప్‌ కీలక పాత్ర పోషించనుందని ఫిన్నోవిటీ కన్సల్టెంగ్‌ కంపెనీ వ్యవస్థపాకుడు పీఎన్‌ విక్రమన్‌ అభిప్రాయపడ్డారు.

ఇదీ చదవండి:జూమ్​ యాప్​కు దీటుగా ఫేస్​బుక్ 'మెసెంజర్​ రూమ్స్​​'

ABOUT THE AUTHOR

...view details