Reliance buys British battery firm: బ్రిటన్‌లోని బ్యాటరీ సంస్థ ఫారాడియన్‌ను రిలయన్స్ ఇండస్ట్రీస్ కొనుగోలు చేసింది. జీబీపీ 100 మిలియన్లకు ఈ ఒప్పందం కుదిరింది. రిలయన్స్ క్లీన్ ఎనర్జీ పోర్ట్ఫోలియాకు ఇది అదనపు బలాన్ని ఇస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
రిలయన్స్‌కు చెందిన ఆర్ఎన్ఈఎస్ఎల్(రిలయన్స్ న్యూ ఎనర్జీ సోలార్ లిమిటెడ్).. ఫారాడియన్లోని 100శాతం వాటాను కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. సంస్థ వృద్ధికి.. మరో జీబీపీ 25మిలియన్ డాలర్లను పెట్టుబడిగా పెట్టనున్నట్టు రిలయన్స్ స్పష్టం చేసింది.