తెలంగాణ

telangana

ETV Bharat / business

Jio BP: 2025 కల్లా 5,500 పెట్రోలు బంక్‌లు!

జియో- బీపీ బ్రాండుపై ముంబయిలో తొలి బంక్‌ (Jio-BP Petrol Pump) ప్రారంభమైంది. విద్యుత్‌ వాహనాలకు ఛార్జింగ్‌ సదుపాయం సహా పలు రకాల ఇంధనాలు ఈ బంకులో లభించనున్నాయి.

reliance bp
రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌

By

Published : Oct 27, 2021, 5:36 AM IST

Updated : Oct 27, 2021, 7:00 AM IST

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, బీపీల సంయుక్త సంస్థ రిలయన్స్‌ బీపీ మొబిలిటీ లిమిటెడ్‌ (ఆర్‌బీఎంఎల్‌) జియో- బీపీ బ్రాండుపై మొదటి పెట్రోలు బంక్‌ను (Jio-BP Mobility Station) నవీ ముంబయిలో ఏర్పాటు చేసింది. విద్యుత్‌ వాహనాలకు ఛార్జింగ్‌ సదుపాయం సహా పలు రకాల ఇంధనాలు ఈ బంకులో లభ్యంకానున్నాయి. "వినియోగదారులకు పలు రకాల ఇంధనాలు అందించే ప్రపంచ శ్రేణి పెట్రోలు బంక్‌లను జియో- బీపీ అందుబాటులోకి తెస్తున్నాయి" అని ఆర్‌బీఎంఎల్‌ ఒక ప్రకటనలో తెలిపింది. వినియోగారులకు అద్భుత అనుభూతిని ఈ బంకులు అందిస్తాయని పేర్కొంది.

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు చెందిన 1400 పెట్రోలు పంపులు, 31 విమాన ఇంధన కేంద్రాల్లో 49 శాతం వాటాని 2019లో బీపీ 1 బిలియన్‌ డాలర్లకు (సుమారు రూ.7500 కోట్లు) ఇదివరకే కొనుగోలు చేసింది. దీంతో ప్రస్తుత బంక్‌లన్నీ సంయుక్త సంస్థకు బదిలీ అయ్యాయి. 2025 కల్లా ఈ సంస్థ తన పెట్రోల్‌ బంక్‌ల సంఖ్యను 5,500కి పెంచుకునే యోచనలో ఉంది. "ప్రస్తుతమున్న 1,400 బంక్‌ల పేరును జియో-బీపీగా మారుస్తాం. రానున్న రోజుల్లో వీటి ద్వారా వినియోగదారులకు పలు రకాల సేవలను అందుబాటులోకి తెస్తాం" అని ఆర్‌బీఎంఎల్‌ పేర్కొంది.

ఇదీ చూడండి:Reliance News: రిలయన్స్‌కు హరిత ఇంధనం- ఐదేళ్లలో భారీగా లాభాలు!

Last Updated : Oct 27, 2021, 7:00 AM IST

ABOUT THE AUTHOR

...view details