తెలంగాణ

telangana

ETV Bharat / business

మార్చి నుంచి అందుబాటులోకి 'స్పుత్నిక్ వి'​ టీకా! - డాక్టర్ రెడ్డీస్

రష్యా రూపొందించిన స్పుత్నిక్​ వి టీకా వచ్చే ఏడాది భారత్​లో అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ మేరకు డాక్టర్​ రెడ్డీస్ లేబొటరీస్ వెల్లడించింది.

sputnik, covid vaccine, dr reddys, march 2020, clinical trials
మార్చిలో స్పుత్నిక్

By

Published : Dec 18, 2020, 6:49 AM IST

స్పుత్నిక్​ వి టీకా వచ్చే ఏడాది మార్చి నాటికి భారత్​లో అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ ప్రకటించింది. రష్యా రూపొందించిన ఈ వ్యాక్సిన్​పై భారత్​లో జరుగుతున్న క్లినికల్ పరీక్షలు మార్చిలో పూర్తవుతాయని సంస్థ గ్లోబల్​ హెడ్​ ఠాకూర్ పేర్వానీ అంచనా వేశారు.

తొలిదశలో 10లక్షల టీకాలను అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. స్పుత్నిక్ టీకా 95 శాతం ప్రభావవంతంగా పనిచేస్తోందని ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. ఇప్పటికే ఆ దేశంలో సామూహిక వ్యాక్సినేషన్​ కూడా ప్రారంభమైంది.

ఇదీ చూడండి:మా టీకా 95 శాతం సమర్థవంతం: పుతిన్

ABOUT THE AUTHOR

...view details