కరోనా సంక్షోభం నుంచి విమానయాన రంగం నెమ్మదిగా తేరుకుంటోంది. సెప్టెంబర్‌లో విమాన ప్రయాణికుల సంఖ్య ఆగస్టుతో పోలిస్తే 37-39 శాతం పెరిగినట్లు రేటింగ్ ఏజెన్సీ ఇక్రా సోమవారం వెల్లడించింది. గత ఏడాది సెప్టెంబర్‌తో పోలిస్తే మాత్రం.. ఈ సంఖ్య 60 శాతం తక్కువని వెల్లడించింది.
ఇదే సమయంలో దేశీయ విమానయాన సంస్థలు తమ కార్యకలాపాలను 46 శాతం వరకు పెంచాయని ఇక్రా వివరించింది. ఆగస్టులో 33 శాతంగా ఉండటం గమనార్హం.
సడలింపులూ కారణమే..
విమానాల్లో భోజనం, ముందే ప్యాక్ చేసిన చిరుతిళ్లను సర్వ్ చేసేందుకు ఆగస్టు చివరి వారంలో ప్రభుత్వం అనుమతుల ఇవ్వడం కూడా ప్రయాణికుల సంఖ్య పెరిగేందుకు కారణంగా పేర్కొంది ఇక్రా.