తెలంగాణ

telangana

ETV Bharat / business

రికార్డుల దిశగా మార్కెట్లు - సెన్సెక్స్

వారం చివరి సెషన్​లోనూ స్టాక్​ మార్కెట్లు లాభాలను నమోదు చేశాయి. సెన్సెక్స్​ 269.43 పాయింట్లు, నిఫ్టీ 83.60 పాయింట్లు పుంజుకున్నాయి.

సెన్సెక్స్

By

Published : Mar 15, 2019, 4:47 PM IST

రికార్డుల దిశగామార్కెట్లు

వారాంతంలో స్టాక్​ మార్కెట్లు ఆకట్టుకున్నాయి. నూతన రికార్డుల దిశగా పరుగులు తీశాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్​ 269.43 పాయింట్లు ఎగబాకింది. మార్కెట్లు ముగిసే సమయానికి 38,024.32 వద్ద స్థిర పడింది.

జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 83.60 పాయింట్ల లాభంతో 11,426.85 వద్ద ముగిసింది.

ఇదీ కారణం

లోక్​సభ ఎన్నికల ఫలితాలపై వెలువడుతున్న అంచనాలతో స్టాక్​మార్కెట్లు లాభపడ్డాయి. దీంతో ఆర్థిక, విద్యత్​ ఉత్పాదక, సాంకేతిక రంగాల్లో భారీగా కొనుగోళ్లు నమోదయ్యాయి. ఓ దశలో సూచీలు భారీ లాభాలను నమోదు చేశాయి.

ఇంట్రాడే తీరిది..

సూచీ గరిష్ఠం కనిష్ఠం
సెన్సెక్స్​ 38,254.77 37,760.23
నిఫ్టీ 11,487 11,370.80

లాభానష్టాల్లోనివివే...

నేటి ట్రేడింగ్​లో కొటక్​ మహీంద్రా బ్యాంకు 4.31 శాతం, ఓఎన్​జీసీ 2.84, పవర్​గ్రిడ్​ 2.61, టీసీఎస్​ 2.59, ఎన్​టీపీసీ 2.50, ఎస్​బీఐ 2.25 శాతం లాభాలను నమోదు చేశాయి.

హిందూస్థాన్ యునిలీవర్ అత్యధికంగా 2.23 శాతం నష్టపోయింది. యెస్​ బ్యాంకు 1.92 శాతం, భారతీ ఎయిర్​టెల్​ 1.71, ఐటీసీ 1.52, రిలయన్స్ 1.39, యాక్సిస్​ బ్యాంకు 0.64 శాతం నష్టపోయాయి.

30 షేర్ల ఇండెక్స్​లో 20 లాభాల్లో ముగియగా 10 షేర్లు నష్టాలను నమోదు చేశాయి.

ABOUT THE AUTHOR

...view details