తెలంగాణ

telangana

ETV Bharat / business

పిల్లలకు టీకా.. ఆరోగ్య సిబ్బందికి భారత్‌ బయోటెక్‌ కీలక సూచన - Covaxin Bharat Biotech latest

దేశంలో 15-18 ఏళ్ల పిల్లలకు టీకాపై భారత్‌ బయోటెక్‌ కీలక సూచనలు చేసింది. పిల్లలకు కేంద్రప్రభుత్వ ఆమోదం పొందని టీకాలు ఇస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని.. అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. వారికి కొవాగ్జిన్ మాత్రమే ఇవ్వాలన్న కేంద్రం నిర్ణయాన్ని గుర్తుచేసింది.

Bharat Biotech
భారత్‌ బయోటెక్‌

By

Published : Jan 18, 2022, 11:00 PM IST

Updated : Jan 19, 2022, 8:57 AM IST

టీనేజర్లకు కొవిడ్ టీకాపై ఆరోగ్య సిబ్బందికి భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ కీలక విజ్ఞప్తి చేసింది. 15 నుంచి 18 ఏళ్ల వారికి ఆమోదం పొందని టీకాలు ఇస్తున్నట్టు తమకు సమాచారం వచ్చిందని తెలిపింది. ఆరోగ్య కార్యకర్తలంతా అప్రతమ్తంగా ఉండాలని సూచించింది.

15-18 ఏళ్ల వారికి కేవలం కొవాగ్జిన్‌ మాత్రమే ఇవ్వాలంటూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను ఈ సందర్భంగా గుర్తుచేసింది. భారత్‌లో పిల్లల టీకాకు సంబంధించి కొవాగ్జిన్‌కే అనుమతి ఉందన్న విషయాన్ని స్పష్టంచేసింది. కరోనా వేళ సేవలందిస్తున్న ఆరోగ్య సిబ్బందికి ధన్యవాదాలు తెలుపుతూ ప్రకటన విడుదల చేసింది.

3.59కోట్ల మందికి తొలి డోసు..

మరోవైపు, దేశ వ్యాప్తంగా టీనేజర్లకు టీకా పంపిణీ వేగంగా కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా నిన్నటి వరకు 3.59కోట్ల మందికి తొలి డోసు పంపిణీ చేశారు. మన దేశంలో పిల్లలకు పంపిణీ చేసేందుకు భారత్‌ బయోటెక్‌ సంస్థ ఉత్పత్తి చేసిన కొవాగ్జిన్‌ టీకాకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

ఇదీ చూడండి:కర్ణాటకలో కరోనా విలయం- ఒక్కరోజే 41 వేల కేసులు​

Last Updated : Jan 19, 2022, 8:57 AM IST

ABOUT THE AUTHOR

...view details