ఎక్స్2 ప్రో... స్మార్ట్ఫోన్ల దిగ్గజం రియల్మీ నుంచి వచ్చిన కొత్త మోడల్. అదిరే ఫీచర్లతో ఇటీవలే మార్కెట్లోకి వచ్చింది. ధర రూ.29,999. స్పెసిఫికేషన్స్ బాగున్నా ఖరీదు కాస్త ఎక్కువని అనుకునేవారికి తాజాగా శుభవార్త చెప్పింది రియల్మీ. తక్కువ ధరకే ఎక్స్2 ప్రో 6జీబీ/64జీబీ వేరియంట్‌ను త్వరలోనే విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.
రియల్మీ ఎక్స్2 ప్రో స్పెషిఫికేషన్స్
- క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 855 ఎస్ఏసీ
- 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ
- 6.5 అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ+ (2400X1080 పిక్సెల్స్) సూపర్ అమోలెడ్
- కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్
- 90 హెర్జ్ డిస్ప్లే, వాటర్ డ్రాప్ నాచ్
కెమెరా ప్రత్యేకతలు
- 64 ఎమ్పీ సెన్సార్‌తో పాటు 8 ఎమ్పీ అల్ట్రా వైడ్ కెమెరా
- 2ఎమ్పీ డెప్త్ సెన్సార్, 13 ఎమ్పీ టెలిఫొటో సెన్సార్
- 16 ఎంపీ సెల్ఫీ కెమెరా