పెరుగుతున్న ద్రవ్యలోటును పూడ్చుకునేందుకు కరెన్సీ నోట్లను ముద్రించే ఆలోచనేమీ లేదని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ స్పష్టం చేశారు. ప్రభుత్వం తన ఆర్థిక లోటు లక్ష్యాన్ని వరుసగా మూడో సంవత్సరం సవరించిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
కేంద్ర బడ్జెట్... ప్రస్తుత ఆర్థిక సంవత్సర ద్రవ్యలోటు 3.8 శాతానికి పరిమితం చేస్తామని పేర్కొంది. ఇది అంతకు ముందు బడ్జెట్లో అంచనా వేసిన 3.3 శాతాన్ని మించింది. అలాగే 2019 జులైలో అంచనా వేసిన 3 శాతం ద్రవ్యోల్బణం.. 2021 నాటికి 3.5 శాతానికి పెరగవచ్చని పేర్కొంది.
ప్రభుత్వం ఇప్పటికే ద్రవ్య లోటు పరిమితిని అధిగమించింది. డిసెంబర్ చివరి నాటికి 132 శాతం మేర ద్రవ్యలోటును కలిగి ఉంది.