తెలంగాణ

telangana

ETV Bharat / business

"ఉద్యోగాలు లేకుండా ఇంత వృద్ధి ఎలా సాధ్యం?"

దేశ జీడీపీ వృద్ధిరేటు లెక్కలపై అనుమానం వ్యక్తం చేశారు మాజీ ఆర్​బీఐ గవర్నర్​ రఘురామ్​ రాజన్​. ఉద్యోగ సృష్టి లేనిదే 7 శాతం వృద్ధి రేటు ఎలా సాధ్యమని ప్రశ్నించారు.

By

Published : Mar 27, 2019, 6:55 AM IST

రఘురామ్

ఈ వృద్ధి రేటు ఎలా సాధ్యం?
దేశ వృద్ధి రేటు 7 శాతం పెరిగిందనే లెక్కలపై ఆర్​బీఐ మాజీ గవర్నర్​ రఘురామ్​ రాజన్​ అనుమానం వ్యక్తం చేశారు. ఉద్యోగాల సృష్టి తక్కువగా ఉన్న ఈ సమయంలో ఇది ఎలా సాధ్యమనే సందేహాన్ని వెలిబుచ్చారు. జీడీపీ అంకెలపై కమ్ముకున్న మేఘాలు తొలగిపోవాలంటే సమాచారాన్ని విశ్లేషించటానికి ఒక నిష్పాక్షిక కమిటీ ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు.

ప్రస్తుత గణాంకాలు-వృద్ధి రేటు సరిపోలటం లేదన్న ఆయన కచ్చితమైన జీడీపీ లెక్కల కోసం మళ్లీ గణన చేపట్టాల్సిందేనని స్పష్టం చేశారు.

ఉద్యోగ సృష్టి లేనిదే ఆర్థిక రంగం 7-8 శాతం వృద్ధి సాధించడం అసాధ్యమని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ఇటీవల అన్నారు. ఈ మాటలను ఉద్దేశించి రాజన్​ తాజా వ్యాఖ్యలు చేశారు.

అప్పుడు ప్రారంభమైంది గొడవ:

2018 నవంబర్​లో కేంద్ర గణాంక సంస్థ యూపీఏ హయాంలో నమోదైన జీడీపీ వృద్ధి అంచనాలు తగ్గించింది. అప్పటి నుంచి వరుసగా నాలుగేళ్లు అంటే 2014 నుంచి జీడీపీ సగటు వృద్ధి యూపీఏ హయాంలో నమోదైన దాని కంటే ఎక్కువగా నమోదవుతుంది.

ABOUT THE AUTHOR

...view details