ప్రముఖ ఆన్లైన్ గేమ్ పబ్జీ రికార్డు స్థాయిలో ఆదాయాన్ని ఆర్జించింది. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో 1.3 బిలియన్ డాలర్లు(రూ. 9,731కోట్లు) ఆదాయాన్ని వసూలు చేసింది. పబ్జీ రెవెన్యూ 3 బిలియన్ డాలర్లకు(రూ.22,457కోట్లు) చేరింది. అయితే కరోనా భయాలు నడుమ ప్రజలు ఇళ్లకే పరిమితమవడం వల్ల మార్చి నెలలో పబ్జీ అత్యధికంగా రూ. 2,021కోట్లు లాభాన్ని ఆర్జించింది. ఈ మేరకు అనలిటిక్స్ సంస్థ సెన్సార్ టవర్ వెల్లడించింది. 1.75కోట్ల డౌన్లోడ్లతో ప్రపంచంలోనే భారత్ నుంచి ఎక్కువ మంది పబ్జీని ఇన్స్టాల్ చేసుకున్నారు.
సెన్సార్ టవర్ డేటా ప్రకారం... 2020లో పబ్జీ తర్వాత సింగపూర్‌కు చెందిన గరేన సంస్థ 300 మిలియన్ డాలర్లు(రూ .2,245 కోట్లు), నెట్ఈజ్కు చెందిన నైవ్స్అవుట్ 260 మిలియన్ డాలర్లు(రూ. 1,946 కోట్లు), యాక్టివిజన్ కాల్ ఆఫ్ డ్యూటీ 220 మిలియన్ డాలర్ల (రూ.1,646 కోట్లు) ఆదాయాన్ని పొందాయి.